ఓట్స్‌తో దోస.. ఒక్కసారి తిన్నారంటే జన్మలో వదిలిపెట్టరు..

Dharmaraju Dhurishetty
Nov 10,2024
';

ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి దీనితో తయారుచేసిన ఎలాంటి ఆహారాలు తిన్న అద్భుతమైన లాభాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటున్న వారు ఓట్స్‌తో తయారు చేసిన దోస ప్రతిరోజు తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

అలాగే పొట్ట సమస్యలు ఉన్నవారు కూడా ఓట్స్‌తో తయారు చేసిన దోసను తినవచ్చు.

';

ఓట్స్ దోసకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం పూర్తి వివరాలు ఇవే..

';

కావలసిన పదార్థాలు: ఓట్స్ - 1 కప్పు, ఉప్మా పిండి - 1/2 కప్పు, పొడులు (పసుపు, కారం, ఉప్పు), నీరు - అవసరమైనంత, నూనె - వేయడానికి

';

తయారీ విధానం: ఓట్స్ దోసను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాత్రలో కొంచెం నూనె వేసుకుని వాటిని బాగా వేయించుకోవలసి ఉంటుంది.

';

గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకొని ఓట్స్ను మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి.

';

ఓట్స్ పిండిని తీసుకొని అందులో కొంచెం దోస బ్యాటర్ ను కూడా వేసుకోండి. ఇలా రెండింటిని మిక్స్ చేసి.. పైన పేర్కొన్న పదార్థాలు వేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా అన్ని పదార్థాలను బాగా మిక్స్ చేసుకొని.. దాదాపు ఒక గంట సేపు బ్యాటర్ ను పక్కన పెట్టుకోండి..

';

ఇలా తయారు చేసుకున్న బ్యాటర్ను నాన్ స్టిక్ పెనం ని వేడి చేసి దానిపై సన్నగా దోస వేసుకోండి. ఇలా వేసుకున్న దోసను రెండు వైపులా కాల్చండి.

';

కాల్చిన దోసను ఒక ప్లేట్లోకి తీసుకుంటే రెడీ అయినట్లే.. దీనిని పల్లి చట్నీ తో లేదా పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story