చుండ్రు నివారణ కోసం హెయిర్ ఆయిల్‌లో నిమ్మరసం కలిపి తలకు రాయాలి. మనం రోజు అప్లై చేసుకునే ఆయిల్ లో ఒక రెండు చుక్కలు నిమ్మరసం పిండుకుంటే చాలు.
కొబ్బరినూనెలో.. కొద్దిగా తులసి ఆకులు వేసి.. గోరువెచ్చగా చేసి కలిపి మసాజ్ చేయండి. ఈ చిట్కా కూడా చంద్రుని నివారిస్తుంది.
మెంతుల పొడి, పెరుగు మిశ్రమం తలకు రాసి 20 నిమిషాలు తర్వాత తల స్నానం చేసిన చుండ్రు మాయమవుతుంది.
ముఖ్యంగా మెంతుల పొడి చంద్రుని నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక ఆహారం.. సమయానికి తలస్నానం చేయడం ముఖ్యం.
క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటించడం ద్వారా చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.