వేసవి వచ్చిందంటే చాలు దాహం తీర్చేందుకు చల్లచల్లని పుచ్చకాయలు తింటుంటాం. మరి పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు తాగవచ్చా లేదా, వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందామా
వేసవిలో పుచ్చకాయ తినడాన్ని చాలామంది ఇష్టపడతారు. అందుకు తగ్గట్టే వేసవి సీజన్‌లో మార్కెట్‌లో పుచ్చకాయలు చాలా ఎక్కువగా కన్పిస్తాయి.
అసలు పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు తాగవచ్చా లేదా అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. ఎందుకంటే ఇది సహజం. కొన్ని రకాల పండ్లు తిన్న తరువాత నీళ్లు తాగకూడదు మరి
పుచ్చకాయలో ఫైబర్, పంచదార, నీరు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ అనేది శరీరంలో ఏర్పడే నీటి కొరతను తీరుస్తుంది
పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు తాగడం వల్ల పలు సమస్యలు ఎదురౌతాయంటున్నారు వైద్య నిపుణులు. జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయట
పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే అసౌకర్యంగా ఉంటుంది
పుచ్చకాయ తిన్న తరువాత కడుపు ఒక్కసారిగా చల్లబడుతుంది. అందుకే వేసవిలో ఇది చాలా మంచిది
అందుకే పుచ్చకాయ తిన్నాక కనీసం అరగంట తరువాతే నీళ్లు తాగాలని వైద్యలు సూచిస్తున్నారు