మెగావేలంలో ముంబై ఇండియన్స్ కన్ను వీరిపైనే... కోట్లు కుమ్మరించేందుకు సిద్ధం
భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీని తీసుకునేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది. ఐపీఎల్లో 77 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు పడగొట్టిన షమీ కోసం ఎన్ని కోట్లు వెచ్చించేందుకైనా ముంబై ఇండియన్స్ సిద్ధంగా ఉంది.
భారత స్టార్ బౌలర్ చాహల్ ఐపీఎల్లో సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్లో 160 మ్యాచ్‌లు ఆడి 205 వికెట్లు పడగొట్టిన చాహల్లో వేలంగా దక్కించుకోవాలని చూస్తోంది.
విదేశీ ఆటగాళ్లలో బ్యాటర్ జోస్ బట్లర్‌పై ముంబై కన్నేసింది. ఐపీఎల్లో 107 మ్యాచ్‌లు 3,582 పరుగులు బట్లర్ చేశాడు.
విదేశీ బౌలర్లలో మిచెల్ స్టార్క్‌ను తీసుకోవాలని ముంబై భావిస్తోంది. స్టార్క్ ఐపీఎల్లో 41 మ్యాచ్‌లు ఆడి 51 వికెట్లు తీశాడు.
20 మ్యాచ్‌ల్లో 350 పరుగులు చేసిన యువ బ్యాటర్ నేహాల్ వదేరాను ముంబై తీసుకునే అవకాశం ఉంది.
ఐపీఎల్లో 40 మ్యాచ్‌లు ఆడి 730 పరుగులు చేసిన యువ బ్యాటర్ జితేశ్ శర్మను ముంబై ఇండియన్స్ తీసుకోవాలని చూస్తోంది.
యువ బౌలర్ సుయాశ్ శర్మ (13 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు)ను ముంబై తీసుకునే జాబితాలో ఉన్నాడు.