ఇవి రెండూ మిక్స్ చేసి జ్యూస్‌లా తాగితే.. ఎంత బీపీ ఉన్న నార్మల్ అవ్వాల్సిందే!
Dharmaraju Dhurishetty
Jan 17,2025
';
ఆధునిక జీవనశైలి వల్ల అనారోగ్య సమస్యల బారిన పడే వారి సంఖ్య రోజుకు విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇందులో చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారినే పడుతున్నారు.
';
చాలామంది చిన్న వయసులోనే అధిక రక్తపోటు సమస్య బారిన పడుతున్నారు. నిజానికి ఇలాంటి సమస్యలు వారిని పడడానికి ప్రధాన కారణం ఆధునిక జీవనశైలే..
';
అధిక రక్తపోటు నుంచి విముక్తి పొందడం చాలా కష్టం. రక్తపోటు అదుపులో లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. కొంతమందిలో గుండె సమస్యలు కూడా రావచ్చు.
';
అధిక రక్తపోటు వల్ల చాలామందిలో గుండె సమస్యలు వచ్చి మరణించడం కూడా జరుగుతోంది. అయితే దీని నుంచి విముక్తి పొందడానికి ఆయుర్వేద శాస్త్ర నిపుణులు కొన్ని చిట్కాలు చెప్తున్నారు. వాటిని పాటిస్తే సులభంగా నియంత్రణలోకి తీసుకురావచ్చు.
';
అధిక రక్తపోటును తగ్గించేందుకు దోసకాయ రసం కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ అధిక పరిమాణంలో ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.
';
అధిక రక్తపోటు ఉన్నవారు దోసకాయ రసం తాగేటప్పుడు.. కొన్ని రకాల పదార్థాలను మిక్స్ చేసి తయారు చేసి తాగితే చాలా మంచిది. అయితే ఈ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకోండి.
';
జ్యూస్ తయారీ విధానం: ఈ జ్యూస్‌ని తయారు చేసుకోవడానికి ముందుగా దోసకాయలను పొట్టు తీసి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకోండి.
';
ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అందులో శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత తగినంత నిమ్మరసం వేసి మిక్సీ పట్టుకోండి.
';
ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వడకట్టుకొని రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే పొట్ట సమస్యలతో పాటు అధిక రక్తపోటు సమస్యకు చెక్..