AP Elections 2024 Latest Updates: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ్టి నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీకు రాజధాని అంశం కాస్త ఇరుకున పడే అవకాశముందని భావిస్తున్న తరుణంలో ఇదే ప్రాంతంలో జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతికి వ్యతిరేకంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం, అమరావతి రైతుల నిరవధిక నిరసన దీక్షలు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి అమరావతి రాజధాని ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు అనుకూల ఫలితాలు రావనే వాదన ఉంది. ఈ నేపధ్యంలో ప్రముఖ సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్ధా దాస్ ఉమ్మడి గుంటూరు జిల్లా ఓటర్ల మనోగతంపై సర్వే నిర్వహించారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల జిల్లాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఈ సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పార్ధా దాస్ సర్వే ప్రకారం ఈ 17 స్థానాల్లో 9-10 స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెల్చుకోనుంది. మిగిలిన 7-8 స్థానాలను తెలుగుదేశం కూటమి గెల్చుకుంటుంది.
ఈ జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కూటమికి దాదాపుగా ఓట్లు సమానంగా పడవచ్చు. రెండింటికీ 49.9 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. అయితే మహిళల ఓట్లు వైసీపీకు పూర్తిగా పోల్ కానున్నాయని తెలుస్తోంది. పురుషుల ఓట్లలో 52.2 శాతం కూటమికి, 47.4 శాతం వైసీపీకు పడవచ్చని అంచనా. మహిళల ఓట్లలో మాత్రం 57.2 శాతం వైసీపీకు పడవచ్చు. 42.5 శాతం మంది కూటమివైపు మొగ్గు చూపుతున్నారు.
అంటే రాజదాని ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ఊహించినంత వ్యతిరేకత లేదనే తెలుస్తోంది. రాజధాని నిర్ణయం కంటే ఆ పార్టీ అందించిన సంక్షేమ పధకాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అర్ధమౌతోంది. అందుకే మహిళా ఓటర్లలో మెజార్టీ వైసీపీ వైపు ఉన్నారని పార్ధా దాస్ అంచనా వేశారు. జాతీయ నాయకత్వం గురించి ప్రజల్ని ప్రశ్నించినప్పుడు మరింత ఆసక్తికర సమాధానాలు వెలువడ్డాయి. నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీలో ఎవరు ప్రధానమంత్రి అంటే దాదాపుగా సమానంగా అభిప్రాయలు వ్యక్తమయ్యాయి. 37.2 శాతం మంది మోదీకు జై కొడితే 37 శాతం మంది రాహుల్ గాంధీకు సై అన్నారు. మరో 25.7 శాతం మంది తటస్థంగా ఉన్నారు.
Also read: Ys Jagan Bus Yatra: ఇవాళ్టి నుంచే ఇడుపులపాయ టు ఇచ్చాఫురం బస్సు యాత్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి