India Champions Trophy Squad Announcement: కెప్టెన్ రోహిత్ సారథ్యంలోనే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగనుంది. గాయం కోలుకుంటున్న బుమ్రాను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్‌కు వైఎస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చారు.
Prathika Rawal: కొందరు మల్టీ టాలెంటెడ్ ఉంటారు.. గేమ్స్ బాగా ఆడతారు.. అలానే చదువులోనూ టాపర్‌గా ఉంటారు. సరిగ్గా అలాంటి అమ్మాయే ప్రతీక రావల్..! ఆమె గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!
Karun Nair: కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్టు సాగుతోంది కరుణ్ నాయర్ బ్యాటింగ్. విజయ హాజరే ట్రోఫీలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న నాయర్‌కు సోషల్‌మీడియాలో మద్దతు ఒక రేంజ్లో పెరిగిపోతోంది. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు నాయర్‌ను ఎంపిక చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
Rinku singh: టీమిండియా క్రికెట్ ప్లేయర్ రింకు సింగ్ సమాజ్ వాది పార్టీ ఎంపీతో నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య ఈ వేడుకు జరిగింది.
Nitish Reddy: ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో నితీశ్‌రెడ్డికి తుది జట్టులో ఆడే ఛాన్స్ రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్-ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్పాండ్యావైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశముంది. దీంతో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
Nitish Kumar Reddy Climbs Tirumala Steps: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. టాప్ బ్యాటర్లు సైతం ఇబ్బంది పడిన పిచ్‌లపై అదిరిపోయే ఆటతీరుతో దుమ్ములేపాడు. టీమిండియా సిరీస్ ఓడిపోయినా.. నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ ఇన్నింగ్స్ మాత్రం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హఫ్ సెంచరీ తరువాత తగ్గేదేలే అంటూ బ్యాట్‌తో సంబరాలు చేసుకోగా.. సెంచరీ తరువాత బాహుబలి మూవీలో ప్రభాస్ తరహాలో సంబరాలు చేసుకున్నాడు. ఇక ఆటలోనే కాదు భక్తిలోనూ తగ్గేదేలే అని ఈ యంగ్ క్రికెటర్ నిరూపించాడు. మోకాళ్లపై తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కుతున్న వీడియో వైరల్ అవుతోంది.
Sania Mirza Dating Rumors: షోయాబ్ మాలిక్‌తో విడాకుల తరువాత సానియా మీర్జా రెండో పెళ్లిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఓ బాలీవుడ్ ప్రముఖ నటుడితో ఆమె డేటింగ్లో ఉన్నారని.. అతడినే పెళ్లి చేసుకుంటుందని గతంలో వార్తలు రాగా.. అవన్నీ ప్రచారానికే పరిమితమయ్యాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోతో పెళ్లి పుకార్లు పుట్టించారు. ఇంతకు ఆ హీరో ఎవరు..? ఈ పుకార్లు నిజమేనా..?
Mohammed Shami In Rishabha Pant Out For India T20 Series Against England: ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సుదీర్ఘ కాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు మహ్మద్ షమీని ఎంపిక చేయగా.. రిషబ్ పంత్‌ను పక్కకు నెట్టగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. భారత జట్టులో ఎవరు ఎంపికయ్యారో తెలుసుకోండి.
Smriti Mandhana: భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తన కెరీర్ లో మరో అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకుంది. వన్డే ఫార్మాట్ క్రికెట్లో అత్యంత వేగంగా 4వేల పరుగుల మార్క్ అందుకున్న భారత తొలి మహిళా ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. స్మృతి మంధాన 95 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించింది. శుక్రవారం ఐర్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మృతి మంధాన ఈ మైలురాయిని అందుకుంది.
Yuzvendra Chahal Dhanashree Verma Divorce: యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై ఇద్దరు అధికారికంగా స్పందించకపోయినా.. విడిపోవడం ఫిక్స్ అయిందంటూ సన్నిహితులు చెబుతున్నారు. ఇన్‌స్టాలో ఇద్దరు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోడం.. చాహల్ తన అకౌంట్ నుంచి ధనశ్రీ ఫొటోలను తొలగించడంతో విడాకుల రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే వీరిద్దరు విడిపోవడానికి కారణం ఓ కొరియోగ్రాఫర్ అని తెలుస్తోంది. అతడితో ధనశ్రీ క్లోజ్‌గా ఉండడంతో చాహల్ విడిపోవాలని నిర్ణయించుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
ICC Champions Trophy: టీమ్ ఇండియా మరో సమరానికి సిద్ధమౌతోంది. మరో నెల రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ట్రోఫీ కోసం 15 మంది ఆటగాళ్లతో టీమ్ ఇండియా దాదాపుగా సిద్ధమైందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jasprit Bumrah: ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ ముగిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇండియా 1-3తో పరాజయం పాలైంది. ఇప్పుడు టీమ్ ఇండియా దృష్టి ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌పై పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India vs England ODI T20 : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఆస్ట్రేలియా 3-1తో భారత జట్టును ఓడించింది. ఈ సిరీస్‌లో ఓటమితో 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. తదుపరి సిరీస్‌లో భారత జట్టు ఏ జట్టుతో తలపడుతుందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఈ సిరీస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
Sunil Gavaskar On Team India 2024 : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలిసారిగా భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడింది. ఇందులో ఆస్ట్రేలియా జట్టు 3-1 తేడాతో గెలిచింది. 10 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియాపై సునీల్ గావస్కర్ ఫైర్ అయ్యారు. టీమిండియా ఆటగాళ్లకు పరోక్షంగా చురకలంటించారు.
Kolkata news: టిమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూతురుకు పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో అంత ఒత్తిడితో కూడా ఆమె ప్రదర్శించిన ధైర్యసాహాసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Ind vs Aus: టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ రసవత్తరంగా మారుతోంది. రెండ్రోజులకే దాదాపు మూడో ఇన్నింగ్స్ నడుస్తోంది. భారత్ 145 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Yuzvendra Chahal Dhanashree Verma Divorce: కొత్త ఏడాదిలో క్రికెట్ అభిమానులకు షాక్‌కు గురి చేసే వార్త వెలుగులోకి వచ్చింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ దంపతులు విడాకులు తీసుకునేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోగా.. చాహల్ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తన భార్య ఫొటోలను డిలీట్ చేశాడు. దీంతో విడాకుల వార్తకు మరింత బలం చేకూరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.