India vs Bangladesh: చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తొలి మ్యాచ్‌ను అద్భుతంగా ప్రారంభించింది. మహ్మద్ షమీ ఐదు వికెట్లతో బంగ్లాదేశ్‌ను గడగడలాడించగా.. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్ని తౌదోయ్ హృదయ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. వీరిద్దరూ రికార్డు సృష్టించడంతో ఈ మ్యాచ్‌లో పలు ఘనతలు నమోదయ్యాయి. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 49.4 ఓవర్లకు ఆలౌట్ కాగా.. భారత్ 229 పరుగుల లక్ష్యం చేధించాల్సి ఉంది.
Also Read: Ind Vs Ban Champions Trophy 2025: తడబడి కుప్పకూలిన బంగ్లాదేశ్.. భారత్ ముందు మోస్తరు లక్ష్యం
రసవత్తరంగా..
భారత బౌలింగ్ దళం బంగ్లా బ్యాటర్లను భారీ పరుగులు రాబట్టకుండా నియంత్రించింది. మొదట టపటపా వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ద్వితీయార్థంలో నిలకడగా ఆడి మోస్తరు స్కోర్ నమోదు చేసింది. మొదట దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశ్ అనంతరం భారత బౌలర్లను మొండిగా ఎదుర్కొన్నారు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో జేకర్ అలీ, హృదయ్ అద్భుతంగా ఆడడంతో 228 పరుగులు చేసి భారత్‌కు లక్ష్యం విధించింది.
Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలుచోట్ల భారీ వర్షం
భారత బౌలింగ్ దళం బంగ్లా బ్యాటర్లను భారీ పరుగులు రాబట్టకుండా నియంత్రించింది. మొదట టపటపా వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ద్వితీయార్థంలో నిలకడగా ఆడి మోస్తరు స్కోర్ నమోదు చేసింది. మొదట దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశ్ అనంతరం భారత బౌలర్లను మొండిగా ఎదుర్కొన్నారు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో జేకర్ అలీ, హృదయ్ అద్భుతంగా ఆడడంతో 229 పరుగులు చేసి భారత్‌కు లక్ష్యం విధించింది.
నిలబెట్టిన హృదయ్, జేకర్
టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన భారత్ అద్భుతంగా బంగ్లాదేశ్‌ను నియంత్రించింది. తొలి పది ఓవర్లలో బంగ్లాదేశ్‌పై నిప్పుల్లాంటి బంతులు వేసి ఐదు వికెట్లు పడగొట్టగా.. తర్వాత భారత బౌలర్లను బంగ్లా బ్యాటర్లు నిలువరించారు. ఐదు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జేకర్ అలీ, హృదయ్ అద్భుతంగా ఆడారు. తాంజిద్ హసన్ (25), రిషద్ హోస్సేన్ (18) కొన్ని పరుగులు చేయగా.. సౌమ్య సర్కార్, కెప్టెన్ నజ్ముల్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, తంజీమ్ హసన్ షకీబ్, ముస్తఫిజర్ రహ్మన్ ఐదుగురు డకౌట్‌లయ్యారు. ఓపెనర్లు అదరగొడతారనుకుంటే ప్రారంభంలోనే బంగ్లాదేశ్‌కు భారీ దెబ్బ తగలింది. బంతుల తేడాతో వరుసగా ఐదు వికెట్లు కోల్పోయిన వేళ హృదయ్, జేకర్ అలీ అద్భుతంగా నిలబడ్డారు. 118 బంతులు ఆడి హృదయ్ 100 పరుగులకు ఔటయ్యాడు. 2 ఫోర్లు.. ఆరు సిక్సర్లు బాది జట్టుకు మోస్తరు స్కోర్ అందించాడు.
షమీ 5 వికెట్లతో రికార్డు
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో మహ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. ఐదు వికెట్లు తీసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐసీసీ మ్యాచ్‌ల్లో బంతితో నిప్పులు చెరుగుతున్న షమీ. గతంలో కూడా ఇలా ఐదు వికెట్లు తీసి పలు రికార్డులు తన పేరుపై షమీ నమోదు చేసుకున్నాడు. షమీకి తోడు హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ నిలిచారు. పది ఓవర్లు వేసిన షమీ 53 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా మూడు వికెటలు తీయగా.. అక్షర్ పటేల్‌కు కొద్దిలో హ్యాట్రిక్ వికెట్లు తీసే అవకాశం చేజారింది. మ్యాచ్ ఆరంభంలోనే కీలకమైన రెండు వికెట్లు తీశాడు.
200 వికెట్ల క్లబ్ లో షమీ
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో మహ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. ఐదు వికెట్లు తీసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐసీసీ మ్యాచ్‌ల్లో బంతితో నిప్పులు చెరుగుతున్న షమీ. గతంలో కూడా ఇలా ఐదు వికెట్లు తీసి పలు రికార్డులు తన పేరుపై షమీ నమోదు చేసుకున్నాడు. టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన భారత్ అద్భుతంగా బంగ్లాదేశ్‌ను నియంత్రించింది. తొలి పది ఓవర్లలో బంగ్లాదేశ్‌పై నిప్పుల్లాంటి బంతులు వేసి ఐదు వికెట్లు పడగొట్టగా.. తర్వాత భారత బౌలర్లను బంగ్లా బ్యాటర్లు నిలువరించారు. ఐదు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జేకర్ అలీ, హృదయ్ అద్భుతంగా ఆడారు.
🔙 to what he does the best ⚡️
A terrific spell from @MdShami11 😎
Scorecard ▶️ https://t.co/ggnxmdG0VK#TeamIndia | #BANvIND | #ChampionsTrophy pic.twitter.com/hWa9P61fwX
— BCCI (@BCCI) February 20, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి