Delhi CM Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీ ఇదే..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన మంత్రి ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లడంతో ఢిల్లీ సీఎం ఎంపిక ఆలస్యమైంది. ఎట్టకేలకు దేశ రాజధాని పగ్గాలను ఓ మహిళ చేతిలో పెట్టింది బీజేపీ అధిష్ఠానం. అయితే.. మొత్తంగా గత కొన్ని రోజులుగా వినిపిస్తోన్న ఊహాగానాలకు పులిస్టాప్ పడింది. ఈ రోజు మధ్యాహ్నం రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ కు అప్పగించనున్నారు. 70 మంది శాసన సభ్యులున్న ఢిల్లీలో కేవలం సీఎంతో పాటు మరో ఆరుగురుకి మాత్రమే ఛాన్స్ ఉంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 20, 2025, 12:40 AM IST
Delhi CM Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీ ఇదే..

Delhi CM Rekha Gupta: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన మంత్రి ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లడంతో ఢిల్లీ సీఎం ఎంపిక ఆలస్యమైంది. ఎట్టకేలకు దేశ రాజధాని పగ్గాలను ఓ మహిళ చేతిలో పెట్టింది బీజేపీ అధిష్ఠానం. అయితే.. మొత్తంగా గత కొన్ని రోజులుగా వినిపిస్తోన్న ఊహాగానాలకు పులిస్టాప్ పడింది. ఈ రోజు మధ్యాహ్నం రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ కు అప్పగించనున్నారు. 70 మంది శాసన సభ్యులున్న ఢిల్లీలో కేవలం సీఎంతో పాటు మరో ఆరుగురుకి మాత్రమే ఛాన్స్ ఉంది.

ఇందులో అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా క్యాబినేట్ కూర్పు ఉండబోతుంది. ముఖ్యంగా బనియా (వైశ్య), జాట్ కమ్యూనిటీస్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఛత్తీస్ గడ్ లో విష్ణు దేవ్ సహాయ్, ఒడిస్సాలో మోహన్ చరణ్ మాజీ ఇద్దరు ట్రైబల్ గ్రూపుకు చెందిన వారికి సీఎం పగ్గాలు అప్పగించారు. మధ్యప్రదేశ్ లో బీసీ అయిన మోహన్ యాదవ్ కి.. రాజస్థాన్ లో భజన్ లాల్ శర్మ బ్రాహ్మిన్ కు ఇలా.. హర్యానాలో ఓబీసీ.. యూపీ, ఉత్తరాఖండ్ లో రాజ్ పుత్ కు  ఇలా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒక్కో సామాజానికి వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అటు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్..  ఎస్సీ.. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఎస్టీ.. ఇలా బీజేపీ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో తనకు సాటి లేదు అనిపించుకుంటోంది.

ఢిల్లీ 70km ఏరియా ప్రాంతం. ఢిల్లీకి ఒక వైపు ఉత్తరప్రదేశ్.. మరోవైపు హర్యానా.. ఇక యూపీలో ఢిల్లీని ఆనుకోని నోయిడా.. హర్యానాలో ఢిల్లీ సమీపంలో గుర్గావ్ పెద్ద నగరాలు. ముఖ్యంగా హర్యానాకు చెందిన రేఖా గుప్తా ఇపుడు ఢిల్లీ సీఎం కాబోతుంది. గతంలో సుష్మా స్వరాజ్, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు హరియాణకు చెందిన వారే కావడం గమనార్హం. అంటే హర్యానాలో పుట్టి వీళ్ళంతా ఢిల్లీ కి సీఎం అవుతున్నారు.  సో ఢిల్లీఅంటే మినీ ఇండియా అన్ని ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు.  చాలా తక్కువ మంది అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.  ముఖ్యంగా రేఖా గుప్తా ఎంపిక వెనక ఉమెన్ ప్లస్ బనియా కమ్యూనిటీ ఈ రెండు కూడా రేఖ గుప్తాకు కలిసి వచ్చాయి. ముఖ్యంగా బలమైన బనియా కమ్యూనిటికి చెందిన అరవింద్ కేజ్రీవాల్ ప్లేస్ లో మరో బనియాను బీజేపీ ఎంపిక చేసింది.అంటే మళ్ళీ అరవింద్ కేజరివాల్ ఇంకా ముఖ్యంగా ఈ కమ్యూనిటీ వాళ్లు అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ కు ఓటు వేస్తున్నారు. పార్లమెంట్ వచ్చేసరికి మళ్ళీ మోడీకి ఓటు వేస్తున్నారు.
ఓకే ఆ విధంగా లాయల్టీ చాటుకుంటున్నారు అందుకనే లోక సభ స్పీకర్ గా ఓం బిర్లాని.. సెకండ్ టైం వరుసగా ఎలెక్ట్ చేసుకున్నారు బీజేపీ.

 

రేఖా గుప్తా నియామకం వెనక ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందని చెబుతున్నారు. మొత్తంగా బీజేపీకి ఎక్కడా మహిళా నేతలకు సీఎం పదవి అప్పగించే అవకాశాలు తక్కువే.  బహుశా మహిళా నేతలు కూడా తమిళనాడు కేరళలో అధికారంలోకి రావడం కష్టం.  ఒక బెంగాల్ ఒకటి ఛాన్స్ ఉంది మమతా బెనర్జీని డీ కొట్టిన అక్కడ కూడా అవకాశం లేదు.మొత్తంగా దేశ వ్యాప్తంగా  కమ్యూనిటీస్ ని బ్యాలెన్స్ చేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. పర్వేష్ కు డిప్యూటీ సీఎంగా చేసి జాట్లను సంతృప్తి పరిచే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

సో మొత్తానికి కాస్ట్ ఈక్వేషన్స్ తో కొత్త స్ట్రాటజీ బిజెపి ఫాలో అవుతుందని చెప్పొచ్చు. నార్త్ ఇండియాలో కులాలది ప్రతిదీ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి. అంటే మన సౌత్ లో కులాల పట్టింపు లేదు.ఈ మధ్య చాలా కులాల డిస్కషన్ వస్తుంది. కానీ నార్త్ లో మాత్రం కులాల పట్టింపు చాలా ఎక్కువ ఉంటుంది. కులాల ఆధారంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు అయితే జాట్లు గుజ్జర్లు వీళ్ళ ఆందోళన ఏ విధంగా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.  వీళ్లు ఒకసారి ఢిల్లీలో రైలు పట్టాల మీద పడుకుంటే ఢిల్లీకి వెళ్లే వాటర్ ఆగిపోతుంది.  ట్రైన్స్ సహా అన్ని ఆగిపోతాయి. ఓకే సో చాలా వైలెంట్ గా కూడా నిరసనలు ప్రొటెస్ట్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి.  హర్యానా పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిటీస్ ను  అన్నిటిని బ్యాలెన్స్ చేసే దిశగా బిజెపి నిర్ణయం తీసుకుందని  అనుకోవచ్చు.

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News