Manchu Manoj Halchal At Bhakarapeta PS Video: వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా భాకర పేట పీఎస్ వద్ద హీరో మంచు మనోజ్ అర్ధరాత్రి హల్చల్ చేశారు. తనని అరెస్టు చేయడానికి వచ్చారు అంటూ నిరసనకు దిగారు. తిరుపతిలోని స్థానిక రిసార్ట్ లో మంచు మనోజ్ బస చేశారు. ఈ నేపథ్యంలో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు అక్కడికి వెళ్లి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు.. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా ఆ తర్వాత అనంతపురం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..
అయితే రిసార్ట్ వద్ద మంచి మనోజ్ తో పాటు బౌన్సర్లు ఉండడంతో పోలీసులు గమనించి అక్కడికి చేరుకున్నారు. హైవేపై ఇలా బాన్సర్లు ఉండటంతో ఎవరా? అని ఆరా తీయడానికి వెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ నన్ను ఎందుకు వేధిస్తున్నారంటూ పోలీసులను అడిగాడు. తాను రిసార్ట్ లో ఉంటే ఎస్ఐ, కానిస్టేబుళ్లు సైరన్ వేసుకొని మరి వచ్చారు. నన్ను ఎందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్నారు.. నేనేమైనా షేకావత్నా? నన్ను వచ్చి ఎత్తుకెళ్లడానికి అసలు కారణం ఏంటి? చెప్పాల్సిందే అని పోలీస్ స్టేషన్ మెట్లపై నిరసనకు దిగారు మంచు మనోజ్. అయితే పోలీసులు మాత్రం తాము అరెస్ట్ చేయడానికి వెళ్లలేదని హైవే అది కూడా ఘాట్ వద్ద బౌన్సర్లు కనిపించడంతో ఇక్కడ ఎందుకు ఉన్నారని ఆరా తీయడనికి మాత్రమే వెళ్లామన్నారు. రెండు రోజుల క్రితం మనోజ్ చంద్రగిరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు.
ఇదీ చదవండి: ఎండాకాలం ముందే వచ్చేసింది.. నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు..
మంచువారింట కొన్ని రోజులుగా రచ్చ జరుగుతుంది. హీరో మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య గొడవ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంచి వారి ఫామ్ హౌస్, మోహన్ బాబు కు చెందిన యూనివర్సిటీలోకి కూడా అనుచరులతో మంచు మనోజ్ వెళ్లి అక్కడ కూడా హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.. పోలీసులు జోక్యంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. అయినా కానీ ఏదో విధంగా అప్పుడప్పుడు వారి నడుమ ఉన్న వివాదం బయటపడుతోంది. ఇటీవలే మంచు మనోజ్ ఓ ప్రెస్ మీట్ లో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం కాదు అని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే మంచివారింట రచ్చ జరగడానికి అసలు కారణం తెలియదు కానీ.. కొందరు ఫామ్ హౌస్ గొడవ అని మరికొందరు వ్యక్తిగత కారణాలే అసలు వివాదాలకు దారితీసాయని చెబుతున్నారు. అయితే మంచు మోహన్ బాబు మంచు విష్ణు ఇద్దరు మనోజ్ తీరుపై మండిపడుతున్నారు.
ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ ఎలా యాక్టివేట్ చేయాలి? సింపుల్ స్టెప్స్ మీకోసం
🚨BREAKING NEWS 🚨#ManchuManoj in Police Custody!
Case filled by #MohanBabu Concerning Family MattersStay Strong @HeroManoj1 brother
We all are with you❤️pic.twitter.com/nI8AEibJDm— BS 🦅 (@biggscreen_offl) February 18, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.