Delhi Earth Quake: ఢిల్లీలో భూకంపం, భయంకర శబ్దం..మరోసారి వచ్చే అవకాశం

Delhi Earth Quake: దేశ రాజధానిలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇవాళ ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 17, 2025, 08:27 AM IST
  • ఢిల్లీలో ఇవాళ ఉదయం 5.36 గంటలకు భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత నమోదు
  • భూకంపం కేంద్రం కూడా ఢిల్లీ పరిసరాల్లోనే
Delhi Earth Quake: ఢిల్లీలో భూకంపం, భయంకర శబ్దం..మరోసారి వచ్చే అవకాశం

Delhi Earth Quake: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఇవాళ ఉదయం 5.36 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది. భయబ్రాంతులకు లోనైన ప్రజానీకం రోడ్లపైకి చేరుకుంది. భూకంప కేంద్రం ఎక్కడ, తీవ్రత ఎంత నమోదైందో తెలుసుకుందాం. భూకంపం కేంద్రం ఢిల్లీ పరిసరాల్లోనే ఉండటంతో మరోసారి భూమి కంపించే అవకాశముందని తెలుస్తోంది. 

ఇవాళ ఉదయం 5.36 గంటలకు దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఇళ్లు, ఇంట్లోని వస్తువులు కంపిస్తుండటంతో భయపడిన ప్రజలు ఇళ్లు వదిలి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప కేంద్రం కూడా ఢిల్లీకు సమీపంలోనే 5 కిలోమీటర్ల లోతులో ఉండటం గమనార్హం. అయితే ఎవరికీ ఎలాంటి నష్టం కలగలేదు. ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ పోలీసులు అత్యవసర హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

జనవరి 23వ తేదీన చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో 80 కిలోమీటర్ల లోతులో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు ఆ ప్రభావం ఢిల్లీపై కన్పించింది. అంతకంటే ముందు ఆఫ్ఘనిస్థాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు కూడా ఢిల్లీలో భూమి కంపించింది. ఢిల్లీ భూకంపం జోన్ 4పరిధిలో ఉన్నందున భూకంపాలకు ఆస్కారం ఎక్కువే. ఢిల్లీలో అప్పుడప్పుడూ భూ ప్రకంపనలు రావడం సహజమే అయినా ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంది. అదే సమయంలో భూమి కింద ఏదో విరిగిపోతున్నట్టుగా శబ్దం ఎక్కువగా భయపెట్టిందని ప్రజలు చెబుతున్నారు.

డిల్లీ భూకంపంపై ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా ప్రజలకు ధైర్యం చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సురక్షితంగా ఉండేందుకు ముందు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు. మరోసారి ప్రకంపనలు వచ్చే అవకాశమున్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. 

Also read: TG Inter Hall Tickets 2025: ఇంటర్ హాల్ టికెట్లపై లొకేషన్ క్యూ ఆర్ కోడ్, ఇక అడ్రస్ చాలా ఈజీ గురూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News