Massive stampede at new delhi railway staion: న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ లో భారీ తొక్కిసలాట సంభవించింది. ప్రయాణికుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ముఖ్యంగా.. 13, 14, 15 ప్లాట్ ఫామ్ లపై రైళ్ళు ఎక్కేందుకు ఒకేసారి భారీ సంఖ్యలో ప్రయాణికులు రావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో పలువురు కిందపడిపోయి స్పృహ కోల్పోయారు.
#BreakingNews: Massive crowd at New Delhi Railway Station.
Stampede like situation due to heavy rush for trains on way to #MahaKumbh in #Prayagraj.
Delhi Fire bridge and other emergency serves have rushed to the Railway station.#NewDelhiRailwayStation pic.twitter.com/lmzMpVoUPI
— Hate Detector 🔍 (@HateDetectors) February 15, 2025
ఒక్కసారిగా జనాలు కుప్పలుగా ప్లాట్ ఫామ్ మీదకు రావడంతో తొక్కిసలాట సంభవించింది. మరొవైపు కుంభమేళకు వెళ్లే ట్రైన్ అక్కడిప్లాట్ ఫామ్ మీదకు రావడంతో భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీంతో భారీగా తొక్కిసలాట సంభవించింది. వెంటనే అధికారులు చర్యలు చేపట్టారు.
Read more: Maha kumbh: ముగింపు దశలో కుంభమేళా.. సీఎం యోగి ముందు అఖిలేష్ యాదవ్ సంచలన డిమాండ్.. స్టోరీ ఏంటంటే..?
ఈ క్రమంలోనే న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీగా భక్తులు ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ మీదకు రావడంతోనే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.
ఇప్పటికే కుంభమేళలో గతంలో మౌనీ అమావాస్య నేపథ్యంలో తొక్కిసలాట జరిగి.. 30 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు కుంభమేళకు వెళ్లేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు.
రైళ్లు అన్ని కూడా కిక్కిరిసి ఉంటున్నాయి. కుంభమేళ చుట్టుపక్కల ఇటీవల 300 కి.మీల మేర ట్రాఫిక్ జామ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం దేశ రాజధానిలో తొక్కిసలాట చోటు చేసుకొవడం వార్తలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter