Telangana Cabinet Expansion: రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వం కొలువై దాదాపు 14 నెలలు కావొస్తోంది. అయినా.. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇక అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇక రేవంత్ తో కలిపి మంత్రి వర్గం 18 మంది దాకా స్థానం ఉంది. ఈ లెక్కన చూసుకుంటే.. మరో ఆరుగురికి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంది. ఇక లోక్ సభ ఎలక్షన్ నేపథ్యంలో కొన్నాళ్లు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ వాయిదా వేసారు. మరోవైపు ఈ సారి తెలంగాణ మంత్రి వర్గంలో పదవులు ఆశిస్తున్న ఆషావహుల లిస్ట్ పెద్దగా ఉంది. అయితే.. ఇపుడున్న 12 మందిలో ఎవరికన్నా.. రేవంత్ ఉద్వాసన పలుకుతారా అనేది చూడాలి. ఇపుడున్న క్యాబినేట్ లో ఎవరిని తీసేసినా.. తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద ప్రకంపనలే వస్తాయి. కాబట్టి ఉన్న వారిని తీసేసి కొత్తవారికి ఇవ్వడం అంతా ఈజీ కాదన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకటవుతున్నారు.
ఈ నేపథ్యంలో త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణపై ఇక్కడి నేతలు ఆశలు పెట్టుకున్నారు. మొత్తంగా 14 నెలలుగా ఊరిస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నేడు ఎండ్ కార్డ్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లిన ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అజెండా క్యాబినెట్ విస్తరణపైనే ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. దాంతో మరోసారి ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ను మార్చిన అధిష్టానం మంత్రి వర్గ విస్తరణపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఖాళీ ఉన్నవి ఆరు మంత్రు పదవులు అయితే ఆశావాహుల జాబితా మాత్రం భారీగా ఉంది. మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమసాగర్ రావు, మదన్ మోహన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి ముదిరాజ్, బాలునాయక్, రామచంద్రనాయక్ ఉన్నారు. ఎమ్మెల్సీలు అమిర్ అలీఖాన్, కోదండ రాం తదితరులు ఉన్నారు. ఇక మంత్రి మండలిలో అవకాశం దక్కని వారికి నామినేటెడ్ పదవులను ఇచ్చి సంతృప్తి పరచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మరవైపు బీసీలకు అండగా ఉంటామని చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఆచరణలో అది చూపించడం లేదు. అందుకే ఈ సారి విస్తరణలో బీసీ, ఎస్సీలకు అధిక ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయి. మరోవైపు కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి .. క్యాబినేట్ హోదా ఉన్న ఏదైనా కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చే యోచనలో రేవంత్ సర్కారు ఉంది. మొత్తంగా మంత్రి వర్గ విస్తరణతో రేవంత్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అనే చందంగా ఉంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.