Hyderabad Metro Charges: హైదరాబాద్ వాసులపై మెట్రో ఛార్జీల బాదుడు.. ఏ మేరకు అంటే..?

Hyderabad Metro Charges: హైదరాబాద్‌ మెట్రో ఛార్జీలు పెరగనున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. హైదరాబాద్‌ మెట్రోని నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై అంతర్గతంగా కసరత్తు చేస్తోందని సమాచారం.

1 /6

Hyderabad Metro Charges: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో  వైయస్ హయాంలో ఓకే అయినా హైదరాబాద్  మెట్రో రైలు ప్రాజెక్ట్ .. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పట్టాలెక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలో ఐదేళ్ల క్రితం ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ మెట్రోను ప్రారంభించారు.

2 /6

ముందుగా మియా పూర్, ఎల్ బి నగర్ మధ్య ప్రారంభమైంది. ఆ తర్వాత నాగోల్, హైటెక్  సిటీ మధ్య మెట్రో రైలు ప్రారంభమైంది. ఆ తర్వాత ఎంజీబీఎస్, జేబీఎస్ మెట్రో రైలర మార్గం పూర్తైయింది. ఇక  ఐదేళ్ళ క్రితం ఏదైతే  ధరలు ఉన్నాయో.. ప్రస్తుతం అవే అమలులో ఉన్నాయి.

3 /6

ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్టుగా మెట్రో సర్వీసులు పెంచినా.. కొత్త కోచ్ లు కొనుగోలు చేసేందుకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఆ  సంస్థ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇప్పుడున్న 57 మెట్రోరైళ్లు మూడు మార్గాల్లో చాలడం లేదంటున్నారు. అదనంగా మరో 10 రైళ్లు అయినా అవసరమని మెట్రో వర్గాలు అంచనా వేస్తున్నాయి.

4 /6

ఆక్యుపెన్సీ బాగున్నా.. అందకు తగ్గట్టు రెవెన్యూ రావడం లేదని చెబుతున్నారు. దీంతో సంస్థ తీవ్ర నష్టాల్లో ఉందని చెబుతున్నారు. సర్కారు ఆర్థికంగా సహకరిస్తే  కొత్త కోచ్‌లు కొంటామంటోంది. దీంతో ఛార్జీల పెంపు కోసం ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తోంది. 

5 /6

మెట్రోరైలు సేవలు మొదలై ఐదేళ్లు పూర్తైన సమయంలో ఛార్జీలు పెంచాలని  రెండేళ్ల క్రితం ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీన్ని కేంద్రానికి నివేదించగా అప్పుడు ఒక కమిటీ వేశారు. ఆ సంస్థ ఇచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

6 /6

అప్పుడు ఎన్నికల సమయం  కావడంతో అప్పటి ప్రభుత్వం పెంపు ప్రతిపాదనలను తిరస్కరించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావడంతో మరోసారి మెట్రో ఛార్జీల ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. తాజాగా  పెంపు ప్రతిపాదనలతో రావాలని హెచ్‌ఎంఆర్‌  ఎల్‌ అండ్‌టీని కోరింది.