4 Percent DA Hike For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ జాక్‌పాట్ లభించింది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించి డీఏను ప్రభుత్వం భారీగా పెంచింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం ఉద్యోగులకు కానుక ఇచ్చింది. డీఏ పెరుగుదలపై ప్రకటన చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ జాక్‌పాట్ లభించింది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భారీ కానుక అందించింది. డీఏ పెరుగుదలను ప్రకటించింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవగా ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3.89 లక్షల కోట్ల బడ్జెట్‌ను చదివి వినిపించారు.
స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) 6.8 శాతం పెరిగింది. ఇది భారతదేశ మొత్తం వృద్ధి రేటు 6.37 శాతం కంటే ఎక్కువ ఉందని ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో వెల్లడించారు.
ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. బోధన, బోధనేతర సిబ్బందితోపాటు పింఛన్‌దారులకు డియర్‌నెస్ అలవెన్స్‌పై కీలక ప్రకటన చేసింది. డీఏలో నాలుగు శాతం పెరుగుదల ఉంటుందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటించారు.
డియర్‌నెస్ అలవెన్స్ 4 శాతం పెంపుతో 6వ వేతన సంఘం సిఫారసులకు అనుగుణంగా మొత్తం డీఏ 18 శాతం చేరుకుంటుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీగా లబ్ధి చేకూరనుంది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డీఏ పెంపుతోపాటు జీతాల పెరుగుదల చేస్తుండడంతో ఇతర రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల ఉద్యోగులు కూడా డీఏ, జీతాల పెంపుపై డిమాండ్‌లు మొదలవుతున్నాయి.