36 Banned Chinese Apps Now Available: భారత భద్రత నేపథ్యంలో బ్యాన్ చేసిన చైనీస్ యాప్స్ తాజాగా మళ్లీ భారత్‌లోకి రీఎంట్రీ ఇచ్చాయి. ఇవి ప్రస్తుతం ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. 2020 సంవత్సరంలో ఈ యాప్‌లను భారత్ నిషేధించింది. తాజాగా భారత్ చైనా మధ్య సంబంధాలు మెరుగవ్వడంతో మళ్లీ ఈ యాప్స్‌ను భారత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం 36 చైనీస్ యాప్‌లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి.
2020 గాల్వాన్ లోయ అటాక్ కారణంగా మొత్తం 59 చైనీస్ యాప్‌లను భారత్ నిషేధించింది. అందులో యూసీ బ్రౌజర్, షీన్, టిక్‌టాక్ నిషేధించింద. ఆ తర్వాత 2022లో పబ్జీ, గరేనా ఫ్రీ ఫైర్ కూడా తొలగించింది. అలా దాదాపు 200 చైనీస్ యాప్‌లను బ్లాక్ చేసింది.తాజాగా ఇందులో 36 యాప్‌లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇవి ఇండియన్ కంపెనీల భాగస్వామ్యం లేదా కొత్త బ్రాండ్ పేరుతో అందుబాటులోకి వచ్చాయి.
Xender యాప్ ఇది ఓ ఫైల్ షేరింగ్ యాప్, Youku ఇది ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్, Taobao ఇది అలీబాబాకు చెందినది తాజాగా రిలయన్స్ భాగస్వామ్యంతో అందుబాటులోకి వచ్చిన ఆన్లైన్ షాపింగ్ పోర్టల్, Tantan ఇది చైనీస్ డేటింగ్ యాప్, Mango Tv ఇది ఎంటర్టైన్మెంట్ యాప్
ఈ యాప్స్ అందుబాటులోకి రావడంతో ఇండియన్ యూజర్లకు బిగ్ రిలీఫ్ దొరికింది. ముఖ్యంగా ఫైల్ షేరింగ్, షాపింగ్, స్ట్రీమింగ్, గేమింగ్ యాప్స్ వారికి గుడ్‌న్యూస్. అయితే, ప్రముఖ వీడియో యాప్ అయిన టిక్‌టాక్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు.
ఈ యాప్‌లలో యూట్యూబ్ మాదిరి Youku పనిచేస్తోంది. మ్యాంగో టీవీ యథావిధిగా అందుబాటులో ఉంది. ఇక 2020 లో నిషేధించిన పబ్జీ బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) గా సౌత్ కొరియా కంపెనీ క్రాఫ్టన్ పేరు పై అందుబాటులోకి వచ్చింది.
ఈ నిషేధించినబడిన చైనీస్ యాప్స్ ఆండ్రాయిడ్ యూజర్లతోపాటు యాపిల్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్స్ భారత్‌తో చట్టబద్ధంగా పనిచేయనున్నాయి. కానీ, చాలామంది ఎదురు చూస్తోన్న టిక్ టాక్ మాత్రం అందుబాటులోకి రాలేదు. దీంతో అందరూ కారణం ఏమై ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు.