Laila Movie First Review: లైలా మూవీ ఫస్ట్ రివ్యూ.. A సర్టిఫికేట్ బోల్డ్ కంటెంట్ తో విశ్వక్ సేన్ హిట్ కొట్టాడా..!

Laila Movie First Review: విశ్వక్ సేన్ మాస్ కా దాస్ అంటూ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఇతను ఆడ వేషంలో నటించిన ‘లైలా’ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. సెన్సార్ వాళ్లు A సర్టిఫికేట్ ఇచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ ఫస్ట్ రివ్యూలో చూద్దాం.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 14, 2025, 12:45 AM IST
Laila Movie First Review: లైలా మూవీ ఫస్ట్ రివ్యూ.. A సర్టిఫికేట్ బోల్డ్ కంటెంట్ తో విశ్వక్ సేన్ హిట్ కొట్టాడా..!

Laila Movie First Review: విశ్వక్ సేన్ సినిమాకు సినిమాకు డిఫరెంట్ యాక్టింగ్ తో టాలీవుడ్ లో దూసుపోతున్నాడు. కెరీర్ లో మాస్ కా దాస్, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి వరుస సక్సెస్ లతో హాట్రిక్ హిట్స్ అందుకున్న విశ్వక్ సేన్.. రీసెంట్ గా ‘మెకానిక్ రాకీ’ మూవీతో ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు. తాజాగా ఇపుడు ‘లైలా’ అంటూ టైటిల్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు చాలా మంది హీరోలు ఆడ వేషంలో అలరించారు.

ఇక విశ్వక్ సేన్ కూడా ‘లైలా’గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అంతేకాదు ఆ వేషంలో జానతనంతో పాటు కవ్వింపు అన్ని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో డబుల్ మీనింగ్ డైలాగులో పాటు బోల్డ్ కంటెంట్  ఉండటంతో సెన్సార్ వాళ్లు ‘A’ సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ సినిమా ఫస్టాఫ్ మాస్ అంశాలతో మెప్పించారు. అటు ఆడ పిల్ల లైలా పాత్రలో ఒదిగిపోయాడు.  విశ్వక్ సేన్ లో మంచి నటుడున్న విషయం ఈ సినిమాతో ప్రూవ్ అయింది.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

‘లైలా’ మూవీ కూడా విడుదలకు ముందే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల చూపు పడింది.  
ముఖ్యంగా నందమూరి కాంపౌండ్, మెగా కాంపౌండ్ అనే చర్చకు తన సినిమాతో తెర లేపాడు. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ మాట్లాడిన డైలాగులు ఏపీలో ప్రతిపక్ష వైసీపీ శ్రేణులకు కోపం తెప్పించాయి. దీంతో బాయ్ కాట్ చేయాలని వాళ్లు పిలుపునిచ్చారు. దీనిపై విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పాడు.

మరోవైపు రామ్ నారయణ్ ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తెరకెక్కించాడు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడటం కష్టమనే చెప్పాలి. మొత్తంగా రొటిన్ స్టోరీతో బోర్ కొట్టించేడనే వాదన ఉంది. విలన్ తో హీరో ప్రేమాయణం ఎబ్బెట్టుగా ఉండటం కూడా ఈ సినిమాకు మైనస్ అని చెప్పాలి. మొత్తంగా బిలో కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News