Women Employees Work From Home: మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్..

Women Employees Work From Home: ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది. అంతేకాదు మహిళలకు ఇంటి నుంచి పనిని కల్పించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణ రెడీ చేస్తోందట.

1 /6

Women Employess Work From Home: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. త్వరలో మహిళలకు ఇంటి నుంచే పని కల్పించే ఆలోచనకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. అన్నీ రంగాల్లో స్త్రీలు, పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ప్రపంచ దేశాల్లో ఎన్నో మార్పులు సంభవించాయి.

2 /6

అందులో ఇంటి నుంచి పనిచేసే సంస్కృతి పెరిగిందన్నారు. అంతర్జాతీయ సైన్స్ లో మహిళలు, బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలు శుభాకాంక్షలు తెలియజేసారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పెరుగుతున్న సాంకేతిక అందుబాటులోకి రావడంతో ఇంటి నుండి పని చేసే సంస్కృతి పెరిగిందన్నారు బాబు. 

3 /6

ముఖ్యంగా అత్యవసర సర్వీసులైన రెవెన్యూ , పోలీసు, హాస్పిటల్, టీచర్లు విభాగాలు  తప్పించి మిగిలిన విభాగాల్లో ఆఫీసుకు వచ్చే అవసరం లేని వాళ్లకు ఇంటి నుంచే పని కల్పించే యోచనలో ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

4 /6

ముఖ్యంగా రిమోట్ వర్క్, కో వర్కింగ్ స్పెస్ లు, నైబర్ వుడ్ వర్క్ స్పేసెస్ తో పాటు డాటా ఎంట్రీ ఆపరేటర్స్ అయిన మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

5 /6

ముఖ్యంగా మహిళలు అటు ఉద్యోగంతో పాటు ఇటు ఇంటి బాధ్యతలను చూస్తూ శారీరకంగా మానసికంగా ఎంతో అలసిపోతున్నారు.  ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ కరెక్ట్ గా ఉంటుందన్నారు ఏపీ సీఎం. ఏపీలో మహిళ ఉద్యోగుల పాలిట ఇది అర్థవంతమైన మార్పుకు ఇది శ్రీకారం చుట్టబోతుందన్నారు.

6 /6

ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ జిసిసి పాలసీ 4.0 ఒక గేమ్-ఛేంజింగ్ అడుగు అన్నారు. ఏపీలో ప్రతి నగరం, పట్టణం, మండలంలో ఐటీ ఆఫీసులకు పెట్టడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.  చిట్ట చివరి స్థాయిలో ఉన్నమహిళా ఉద్యోగులు రిమోట్- హైబ్రిడ్ పనుల వల్ల విశేష ప్రయోజనం పొందుతారని తెలిపారు చంద్రబాబు.