Manda Krishna: మందకృష్ణ యూటర్న్.. సీఎం రేవంత్ తో కీలక భేటి..

Manda Krishna: ఎమ్మార్పీస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ యూటర్న్ అనే కంటే తమ పోరాటానికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్నారు. ఇప్పటికే కేంద్ర స్థాయిలో ఎస్సీ రిజర్వేషన్ అంశానికి ప్రధాని నరేంద్ర మోడీ మద్ధతు తెలిపారు. మరికొన్ని రోజుల్లో అది చట్ట రూపం దాల్చనుంది. మరోవైపు ఈ అంశంపై మందకృష్ణ తెలంగాణ సీఎంతో భేటి కావడం రాజకీయ ప్రాధాన్యత సంతకరించుకుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 12, 2025, 07:26 AM IST
Manda Krishna: మందకృష్ణ యూటర్న్.. సీఎం రేవంత్ తో కీలక భేటి..

Manda Krishna: ఎస్సీ ఉప కులాల్లో ఒక వర్గానికి సంబంధించిన వారే ఎక్కువ ఫలాలు అందుకుంటున్నారనే దానిపై దాదాపు 30 యేళ్ల మంద కృష్ణ మాదిగ .. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేశారు. అంతేకాదు గత 3 దశాబ్దాలుగా ఈ అంశంపై నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి కేంద్ర గుర్తించి దానిపై ఓ కమిషన్ ఏర్పాటు చేసింది. త్వరలో పార్లమెంట్ లో బిల్లు ద్వారా చట్ట రూపం సంతరించుకోనుంది. మరోవైపు ఎస్సీల్లో మరో వర్గం వారు ఎస్సీ వర్గీవరణపై గుర్రుగా ఉన్నారు. మరోవైపు మంద కృష్ణ మాదిగలు ఇతర ఉప కులాల కోసం చేస్తోన్న పోరాటాన్ని గుర్తించి ఆయన్ని పద్మశ్రీతో గౌరవించింది.

తాజాగా ఎస్సీ వర్గీకరణ వివాదం కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత మంద కృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణపై తమకు ఉన్న అభ్యంతరాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పలు వినతులు, సూచనలు చేశారు.  ఎస్సీ వర్గీకరణ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు మందకృష్ణ మాదిగ. కమిషన్ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయన్నారు. దళిత కులాల హాక్కులు, అస్థిత్వం, భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. అయితే మంత్రి రాజ నరసింహకు తెలియకుండానే మందకృష్ణ మాదిగ సీఎంను కలిశారని తెలుస్తోంది. రాజనర్సింహపై మందకృష్ణ ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

సీఎం రేవంత్ తో  భేటీ అనంతరం ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ.. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు  చేసిన కేబినెట్ సబ్ కమిటీ అధ్యక్షుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. తమ అభ్యంతరాలను తెలిపారు. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నివేదికలో కొన్ని లోపాలున్నాయన్నారు.  ఎస్సీలను 1,2,3 గ్రూపులుగా కాకుండా ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలని కోరారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News