Chicken Alert: చికెన్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్లకు హై పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాతో కోళ్లు మరణిస్తున్నాయని నిర్ధారణైంది. దాంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్ని ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ పొరుగు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వమైతే కొన్ని రోజులు చికెన్ తినవద్దని హెచ్చరించింది.
కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వంతో సహా తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. కొన్ని రోజుల వరకూ చికెన్ తినవద్దని సూచించింది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీలకు వ్యాపించిందని తెలుస్తోంది. వేలాది కోళ్లు మరణిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఏపీలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సైతం కోళ్లు ఫ్లూ కారణంగా మరణిస్తున్నట్టు తేలింది. ఇప్పటికే శాంపిల్స్ సేకరించిన అధికారులు కోళ్ల మరణానికి ఫ్లూ కారణమని తేల్చారు.
తెలంగాణ పశు సంవర్ధక శాఖ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో చికెన్‌పై ఆంక్షలు విధించారు. ప్రజలకు చికెన్ తినవద్దని సూచిస్తున్నారు.
Also read: Salary DA Hike: ఉద్యోగులకు హోలీ గిఫ్ట్, 3 శాతం పెరగనున్న డీఏ, జీతం ఎంత పెరుగుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి