సీఏఏ, ఎన్ఆర్సీ కోసం ఎవరైనా పత్రాలు అడిగితే ఇవ్వొద్దని రాష్ట్ర ప్రజలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. మా రాష్ట్రంలో వెరిఫికేషన్ చేసే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్ తర్వాతి లక్ష్యం ఆ రెండు రాష్ట్రాలు. ఇందుకోసం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోనే పీకే శ్రీకారం చుట్టారు.
ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. మరోసారి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వడివడిగా పావులు కదుపుతోంది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం పనులు మొదలు పెట్టారు.
దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది.. ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఎన్నికల్లో 62 స్థానాలు కైవశం చేసుకుని .. ప్రతిపక్ష పార్టీలకు కనీసం అందనంత దూరంలో కూడా దొరకకుండా విజయతీరాలకు చేరుకుంది.
ఎన్నికల్లో విజయం సాధించిన రోజే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై కాల్పులు జరగడం ఢిల్లీలో కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసి విచారణ చేపడితే నిందితుడు దొరుకుతాడని ఎమ్మెల్యే నరేష్ యాదవ్ పేర్కొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండో పర్యాయం కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతం సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యేలా ఉంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. దీంతో మరోసారి ఢిల్లీ పీఠాన్ని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకున్నట్లయింది.
ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఐతే ఆమ్ ఆద్మీ పార్టీ జోరుగా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దీంతో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి విజయం తథ్యమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Delhi Election Results | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్న రోజే లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. అభివృద్ధికి పట్టం కడతామని ప్రజలు తీర్పు ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. అంతా ముందు ఊహించిన విధంగానే ఢిల్లీ ఎన్నికల్లో దేశ రాజధాని ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టినట్లుగా కనిపిస్తోంది. గత ఐదేళ్ల మళ్లీ కావాలని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌లో అధికార ఆప్ ఆద్మీ పార్టీ మరోసారి సత్తా చాటింది. ఆప్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అభినందించారు.
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ. .. జోరుగా దూసుకు వెళ్తోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఢిల్లీ ప్రజలకు 200యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తామన్న అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనే ఆప్ విజయానికి బాటలు వేసిందన్నారు బీజేపీ ఎంపీ రమేష్ బిదురి. తాజా ఓట్ల లెక్కింపులో ఆప్ 55స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.
ఢిల్లీ ఫలితాల వెల్లడి కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ పార్టీ దాదాపు 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
ఢిల్లీ ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరికాసేపట్లో తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. మొత్తంగా మధాహ్నం వరకు ఈవీఎంలలో నిక్షిప్తమైన 672 మంది భవితవ్యం తేలిపోనుంది. ఈ నేపథ్యంలో దేశంలో అందరి చూపు .. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటుతామని అటు ఆమ్ ఆద్మీ పార్టీ .. ఇటు బీజేపీ రెండు ధీమాగా ఉన్నాయి.
ఢిల్లీ ఎన్నికల్లో ఊహించిందే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకే జనం మళ్లీ పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో మళ్లీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వమే కొలువుదీరేలా కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.