Retirement Age Increase: ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించినట్టుగానే భారీ బాంబు పేలింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదవీ విమరణ చేసే ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందించడంలో విఫలమవుతుండడంతో వారి ఉద్యోగ జీవిత వయస్సును పెంచారు. 60 ఏళ్లు ఉన్న దానిని 65 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు ఊహించినట్టుగా భారీ షాక్ తగిలింది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: Dearness Allowance: హెచ్‌ఆర్‌ఏ, డీఏ ఎప్పుడు ఇస్తారు? యూనివర్సిటీ ఉద్యోగుల పోరుబాట
విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా వారి పదవీ విరమణ వయస్సును రేవంత్ రెడ్డి ప్రభుత్వం 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 3ను విడుదల చేసింది. అయితే నిర్ణయం తీసుకున్న రెండు రోజుల తర్యాత ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా ఈ ఉత్వర్వులు విడుదల చేశారు.
Also Read: Reddy Women: తీన్మార్ మల్లన్నకు 'రెడ్డి మహిళల' షాక్.. నాలుక చీరేస్తామని హెచ్చరిక
ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల పదవీ విరమణ వయస్సు పెంపు ఉంటుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తమ వయస్సు కూడా పెంచుతారని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు దశలవారీగా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. వారు నిరసనలు చేపడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. నేడు ప్రొఫెసర్లు.. రేపు తమ పదవీ విరమణ వయస్సు పెరుగుతుందని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే తమ వయస్సు కూడా పెరుగుతుందని భయాందోళనలో ఉన్నారు. కాగా ప్రభుత్వం వెలువరించిన తాజా ఉత్తర్వులపై ప్రొఫెసర్లు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.