న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధిస్తూ బీజేపీకి మరోసారి షాకిచ్చిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాలు నెగ్గిన ఆప్ ఈసారి 62 సీట్లు సాధించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 3సీట్లకే పరిమితమైన బీజేపీ తాజా ఫలితాలలో 8 సీట్లు నెగ్గింది. ఈ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఆప్ 53.57 ఓట్లను సాధించగా, బీజేపీకి 38.51 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఎన్నికల ఫలితాల కథనాల కోసం క్లిక్ చేయండి
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నెగ్గిన సీట్లలో 6 సీట్లను తాజా ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకోవడం విశేషం. ఇదే సమయంలో 2015 ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గిన సీట్లలో ఒక్క సీటును తాజాగా ఆప్ తన ఖాతాలో వేసుకుంది. అంటే ఆప్ ఆరు సిట్టింగ్ సీట్లను కోల్పోతే బీజేపీ మాత్రం ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని సమర్పించుకుంది. బదార్పూర్, గాంధీ నగర్, ఘోండ, కరవాల్ నగర్, లక్ష్మీ నగర్, రోహ్తస్ నగర్ సిట్టింగ్ స్థానాలకు బీజేపీకి అధికార ఆప్ కోల్పోయింది. కాగా ముస్తఫాబాద్ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది.