MAX OTT Streaming: కిచ్చా సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మ్యాక్స్’. మాస్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ అయిన ‘మ్యాక్స్’ డిజిటల్ ప్రీమియర్‌ను ZEE5 ప్రకటించింది. కన్నడ స్టార్ హీరో నటించిన ఈ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మ్యాక్స్’ మూవీ ఈ రోజు రాత్రి 7:30 గంటలకు జీ5లో స్ట్రీమింగ్ కు రానుంది. కొత్త దర్శకుడు విజయ్ కార్తికేయ డైరెక్షన్‌లో వచ్చిన ఈ హై ఆక్టేన్, హార్ట్ రేసింగ్ రోలర్ కోస్టర్ మూవీకి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ అవతార్‌లో కిచ్చా సుదీప్ చాలా కొత్తగా కనిపించారు. కన్నడ బాక్సాఫీస్ వద్ద మ్యాక్స్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళంలోనూ మంచి ఆదరణను దక్కించుకుంది.
కిచ్చా సుదీప్‌తో పాటుగా ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, సుకృతా వాగ్లే, సునీల్, అనిరుధ్ భట్ వంటి వారి కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లింగ్ చిత్రాన్ని కలైపులి ఎస్. థాను (వి క్రియేషన్స్), కిచ్చా సుదీప (కిచ్చా క్రియేషన్స్) నిర్మించారు. ఇప్పటికే 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
పోలీసు ఇన్‌స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ (కిచ్చా సుదీప్)గా మ్యాక్స్‌లో కిచ్చా సుదీప్ తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశారు. పోలీస్ ఆఫీసర్ పవర్ ఎలా ఉంటుందో.. ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తే.. గ్యాంగ్ స్టర్‌లను ఎలా పరుగులు పెట్టించవచ్చో ఈ సినిమాలో చూపించారు. ఒక్క రాత్రిలో జరిగే ఘటనలను ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ZEE5లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా జీ5 ప్రతినిధి మాట్లాడుతూ.. ‘అల్టిమేట్ మాస్ బ్లాక్‌బస్టర్ అయిన మ్యాక్స్ చిత్రాన్ని ZEE5 ప్రేక్షకులకు అందించడం పట్ల మేంహ్యాపీగా ఉన్నామన్నారు. కిచ్చా సుదీప్, సినిమా టీం ఇచ్చిన ఈ సహకారం మాకు ఒక అద్భుతమైన మైలురాయిని అందించేలా చేసిందన్నారు. మ్యాక్స్ ఒక థ్రిల్లింగ్ యాక్షన్-ప్యాక్డ్ రైడ్, హై-ఆక్టేన్ డ్రామాగా అందరినీ ఆకట్టుకోవడం గ్యారంటీ అన్నారు.బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించిన ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళం, మలయాళంలో ఈ సినిమాను జీ5లో చూడొచ్చు.
కిచ్చా సుదీప్ మాట్లాడుతూ..‘మ్యాక్స్ మూవీ ZEE5లో స్ట్రీమింగ్ అవుతుండంట నాకు హ్యాపీగా ఉందన్నారు. ముఖ్యంగా థియేటర్లలో విడుదలైన క్షణం నుంచి ఫ్యాన్స్, ఆడియెన్స్‌ను నుంచి ప్రేమ లభిస్తూనే వచ్చిందన్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ పాత్రలో నటించడం గొప్ప అనుభవం. యాక్షన్, ఎమోషన్, ఇంటెన్స్ డ్రామాతో నిండిన ఈ మూవీని ఇప్పుడు జీ5లో అందరూ చూడండన్నారు. మాక్స్ డిజిటల్‌గా ప్రీమియర్‌లను ప్రదర్శిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
దర్శకుడు విజయ్ కార్తికేయ మాట్లాడుతూ.. ‘మ్యాక్స్ జర్నీ నాకు ఎంతో ప్రత్యేకమన్నారు. నాకు ఈ ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవం అన్నారు.బాక్సాఫీస్ వద్ద వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌తో విజయం సాధించామన్నారు. ZEE5లోకి మ్యాక్స్ రాబోతోండటం ఆనందంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.