leopard enters wedding in lucknow: అడవులకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో తరచుగా క్రూర జంతువులు వస్తుంటాయి. అవి వేటకోసం, తాగు నీరు కోసం గ్రామాల్లోకి వస్తుంటాయి. కొన్ని సార్లు అవి పశువులు, పెంపుడు జంతువులు, మనుషులపై కూడా దాడులు చేస్తుంటాయి. ఇటీవల చిరుత పులులు అడవుల నుంచి ఎక్కుగా జనావాసాల్లోకి వస్తున్నాయి. కొన్నిసార్లు అవి పెంపుడు కుక్కల మీద దాడులు చేసిన వీడియోలు వైరల్ గా మారాయి.
తాజాగా.. ఒక చిరుతల ఏకంగా పెళ్లిలో ఎంట్రీ ఇచ్చింది. దీంతో పెళ్లికి వచ్చిన అతిథులు, కొత్త జంట కూడా పారిపోయి కార్లలో దాక్కున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవూలో చోటు చేసుకుంది. లఖ్ నవూలోని బుద్ధేశ్వర్ రోడ్‌లోని ఎంఎం లాన్ గెస్ట్ హౌస్‌లో బుధవారం రాత్రి పెళ్లి వేడుక జరిగింది. ఆ గెస్ట్ హౌస్ అడవికి కాస్త దగ్గరగా ఉంది. అయితే.. ఒక చిరుత పెళ్లిలో ఎంట్రీ ఇచ్చింది. దీంతో కొత్త జంటు, అతిథులు ఒక్కసారిగా భయంలో పరుగులు పెట్టారు.
Lucknow: A Leopard enteres wedding venue. pic.twitter.com/67wygaXZge
— Smriti Sharma (@SmritiSharma_) February 13, 2025
వెంటనే సిబ్బంది అప్రమత్తమైన.. చిరుత ప్రవేశించిన గెస్ట్ హౌస్ ను బైట నుంచి లాక్ వేశారు. వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో గెస్ట్ హౌస్ లో సుమారు 200 మంది ఉన్నారు. వారంతా రూమ్ లు, కార్లలో దాక్కున్నారు. మరికొందరు పులి కంటపడకుండా.. హాల్ లోనే దాక్కున్నారు. అప్పుడు రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బందిని చిరుతను పట్టుకునేందుకు కొన్ని గంటల పాటు శ్రమించారు.
అది పలు మార్లు ఫారెస్ట్ సిబ్బంది పెట్టిన వల నుంచి తప్పించుకొని, ఒకసారి సిబ్బంది మీద దాడి కూడా చేసింది. కానీ చివరకు.. ఫారెస్ట్ సిబ్బంది మత్తు మందు ఉన్న గన్ తో చిరుతను కాల్చారు. ఆ తర్వాత మత్తులో కింద పడిపోయిన చిరుతను బంధించి బోనులోకి ఎక్కించారు. చిరుతను బంధించడంతో పెళ్లికి వచ్చిన వారంతా హమ్మయ్య అని ఊపిరీ పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గ్ మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter