YS Jagan: వైఎస్ జగన్ బ్రహ్మాస్త్రం రెడీ.. ఇది కదా బిగ్ స్కెచ్ అంటే..!

EX CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయాక.. వైసీపీకి కీలక నేతలంతా గుడ్‌బై చెప్పారు..! ముఖ్యమైన లీడర్లంతా కూటమి పార్టీల్లో చేరిపోయారు.. ప్రస్తుతం పార్టీ పూర్తిగా ఢీలా పడింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. వచ్చే ఎన్నికల వరకు మరింత నష్టపోయే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్‌ పార్టీని కాపాడుకునేందుకు ఓ బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేశారా..! జగన్‌ కొత్త ప్లాన్‌తో రాష్ట్రంలో వైసీపీకి పూర్వ వైభవం ఖాయమా..!   

Written by - Ashok Krindinti | Last Updated : Feb 12, 2025, 05:03 PM IST
YS Jagan: వైఎస్ జగన్ బ్రహ్మాస్త్రం రెడీ.. ఇది కదా బిగ్ స్కెచ్ అంటే..!

EX CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీ తన ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల్లో ఓటమి నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్న పార్టీకి నేతల జంపింగ్‌ పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్‌ లీడర్లకు గాలం వేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మాజీమంత్రి శైలజానాథ్‌ను వైసీపీలో చేర్చుకున్నట్టు సమాచారం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్రమంత్రి పళ్లం రాజు, మాజీమంత్రి రఘువీరారెడ్డి, మాజీలు ఎంపీ హర్షకుమార్‌, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ను వైసీపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వీరికి వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తామని వైఎస్‌ జగన్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. 
 
ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టి అడ్రస్‌ లేకుండా పోయింది. గత యూపీఏ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన నేతలు.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా సైలెంట్‌ అయ్యారు. వీరిలో చాలామంది తెలుగుదేశం, బీజేపీలో చేరలేక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ లీడర్లకు వైఎస్‌ జగన్‌ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ ఆహ్వానంలో భాగంగానే.. మాజీమంత్రి శైలజనాథ్‌ వైసీపీ కండువా కప్పుకున్నట్టు సమాచారం. ఇంకొందరు లీడర్లు కూడా త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ లీడర్లంతా వైసీపీలో చేరితే మాత్రం పార్టీ పూర్వవైభవం ఖాయమని వైసీపీ అధినేత జగన్‌ లెక్కలు వేసుకుంటున్నారట.. 

ప్రస్తుతం మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ను వైసీపీలో చేరాలని ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది. అలాగే మాజీ ఎంపీ హర్షకుమార్‌ను కూడా ఫ్యాన్‌ పార్టీలో చేరాలని కోరారని సమాచారం. ఇక అనంతపురం జిల్లాకు చెందిన మాజీమంత్రి రఘువీరారెడ్డికి కూడా వైసీపీలో చేరమంటూ ఆహ్వానం పలికినట్టు తెలిసింది. కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న రఘువీరారెడ్డి.. తన సొంతూరులో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈ లీడర్లంతా వైసీపీలో చేరితే.. పార్టీకి మరింత బూస్ట్‌ అవుతుందని జగన్ లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

వాస్తవానికి 2019-2024 మధ్యకాలంలో చాలా మంది కొత్త లీడర్లకు వైఎస్‌ జగన్ అవకాశం ఇచ్చారు. కానీ ఐదేళ్లు తిరిగే సరికి ఈ లీడర్లంతా తేలిపోయారని జగన్ భావిస్తున్నారట. అందుకే వీరి స్థానంలో పాత లీడర్లకు మరోసారి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట. మరోవైపు రాష్ట్రంలో అధికారంల కోల్పోగానే కీలక లీడర్లు వైసీపీని వీడారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, కొందరు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు జగన్‌కు గుడ్‌బై చెప్పారు. వీరిలో కొందరు టీడీపీలో చేరితే.. మరికొందరు జనసేనలో చేరిపోయారు. దాంతో చాలాచోట్ల వైసీపీకి లీడర్లు లేకుండా పోయారు. ఆయాస్థానాల్లో కాంగ్రెస్‌ నేతలను నింపేయాలని జగన్‌ భావిస్తున్నట్టు సమాచారం. 

మొత్తంగా వైఎస్ జగన్‌ కాంగ్రెస్‌ నేతలకు గాలం వేయడంతో సరికొత్త చర్చ మొదలైంది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా వైఎస్‌ షర్మిల వైసీపీకి తలనొప్పిగా మారారు. అన్న జగన్‌ను తిట్టనిదే షర్మిలకు రోజు గడవడం లేదు.. అయితే షర్మిలకు రాజకీయంగా చెక్‌ పెట్టాలని జగన్‌ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ లీడర్లను వైసీపీలో చేర్చుకోవడం ద్వారా అటు షర్మిలను దెబ్బకొట్టడమే కాకుండా.. తన పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తంమీద ఈ విషయంలో వైఎస్ షర్మిల కూడా ఎలా స్పందిస్తారు అనేది కూడా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

 Also Read: ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

Also Read:  Gold Rate Today: అందనంత ఎత్తుకు బంగారం ధరలు.. తులం లక్ష దిశగా పరుగులు.. నేటి ధరలు ఇవే   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News