Delhi CM Candidate: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 48 సీట్లతో విజయం సాధించిన బీజేపీ త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 12 ఏళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ పాలనకు తెరదించింది. 26 ఏళ్ల తరువాత ఢిల్లీ పీఠాన్ని సాధించగలిగింది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే విషయంలో నాలుగు రోజులుగా నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు తొలగినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రధాని మోదీ ఫిక్స్ చేసినట్టు సమాచారం.
స్వయం కృతాపరాధం, అహంతో చతికిల పడిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు పార్టీని బతికించుకునే పనిలో పడ్డారు. గెలిచిన 22 మందిలో కూడా ఎంతమంది జంపింగ్ జపాంగ్ లు ఉన్నారో తెలియదు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే అంశంపై నెలకొన్న సందిగ్ధత తొలగింది. ముఖ్యమంత్రి అభ్యర్ధి రేసులో పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీ, కైలాష్ గెహ్లోత్, కపిల్ మిశ్రా, అర్విందర్ సింగ్ లవ్లీ, విజేందర్ గుప్తా పేర్లు విన్పించాయి. ఆ తరువాత మహిళకు అవకాశం ఇస్తారనే వాదన విన్పించింది. అన్ని ఊహాగానాలకు ఇప్పుడు దాదాపు తెర పడినట్టు అర్ధమౌతోంది. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా మొదట్లో విన్పించిన పర్వేష్ వర్మనే ఖరారు చేసినట్టు స్పష్టమైన సమాచారం అందుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు పర్వేష్ వర్మకే మొగ్గు చూపినట్టు సమాచారం. ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఇదే పేరు ప్రతిపాదిన వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
పర్వేష్ వర్మ నేపధ్యం
1977 నవంబర్ 7న జన్మించిన పర్వేష్ వర్మది రాజీయ నేపధ్యం ఉన్న కుటుంబం. తండ్రి సాహెబ్ సింగ్ వర్మ ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేశారు. డిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ పొందిన పర్వేష్ వర్మ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పీజీ చేశారు. రాజకీయాల్లో వచ్చే ముందు కొద్దికాలం జర్నలిస్టుగా పనిచేశారు. 2013 నుంచి ముండ్కా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు డిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధి రేసులో ముందు వరుసలో ఉన్నారు.
Also read: India Alliance: మమతా ఒంటరి పోరు, ఇండియా కూటమి విఛ్ఛిన్నమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి