Pawan Kalyan Serious on Chilkur Balaji Rangarajan incident: రామరాజ్యం స్థాపన సంఘం అని చెప్పుకునే కొంత మంది వ్యక్తులు ఇటీవల చిలుకురుకు వెళ్లారు. అక్కడ ప్రధాన పూజారీ రంగరాజన్ ఇంటికి వెళ్లి ఆయనతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా.. భౌతిక దాడులకు పాల్పడ్డారు. రంగరాజన్ ను నెలపై కూర్చుండ బెట్టి.. ఆయన ప్రతిష్టను భంగం కల్గించే విధంగా మాట్లాడారు. రామరాజ్యం సంస్థలో చిలుకూరుకు వచ్చే భక్తుల్ని కార్యకర్తలుగా చేర్పించాల్సింగా కొంత మంది చిలుకూరు బాలాజీ అర్చకుడిని కొరారు. దీనికి ఆయన ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఆయనపై దాడికి దిగారు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి చెందిన అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రల్లో కూడా సంచలనంగా మారింది.
చిలుకూరు బాలాజీని చాలా మంది వీసా బాలాజీగా పిలుస్తుంటారు. ఇక్కడకు వచ్చి దండం పెట్టుకుని వెళ్తే ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుందని కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. ఈ దాడిపై హిందు సంఘాలన్ని భగ్గుమన్నాయి. దీనిపై తాజాగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై దాడి దురదృష్టకరమన్నారు. ఈ దాడి ఘటన తెలిసి చాలా ఆవేదనకు లోనైనట్లు చెప్పారు. ఇది ఒక వ్యక్తిపై కాదు... ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు. రంగరాజన్ గారు.. కొన్ని దశాబ్దాలుగా.. ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు పోరాటం చేస్తున్నారన్నారు.
రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన వారు ఎవరు, వారి ఎజెండా ఏంటో పోలీసులు విచారణ చేపట్టాలన్నారు. వీరిని వెనకుండి నడ్పిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని రేవంత్ సర్కారు దీనిపై ప్రత్యేకంగా పోలీసుల్ని రంగంలోకి దించి విచారణ చేపట్టాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అనేక విలువైన సూచనల్ని రంగరాజన్ గతంలో తమకు ఇచ్చారన్నారు.
టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియచేశారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారని, ఆయనపై చేయిచేసుకొవడంను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా తెలంగాణ జనసేన విభాగం చిలుకూరుకు వెళ్లి రంగరాజన్ గారిని కలిసి తామున్నామని భరోసా ఇవ్వాలని ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter