8th Pay Commission Good News: 8వ వేతన సంఘంపై ఊహించని శుభవార్త, అందరు ఉద్యోగుల జీతాలు విలీనం కానున్నాయా

8th Pay Commission Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం శుభవార్త విన్పించింది. అదే 8వ వేతన సంఘం ఏర్పాటు. దీని ద్వారా 65 లక్షల మంది పెన్షనర్లు, 50 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. 

8th Pay Commission Good News: ఇప్పుడు ఇదే వేతన సంఘం గురించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. నేషనల్ జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం విధి విధానాల రూపకల్పనకు సిఫార్సులు చేసింది. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల పెన్షన్ సంబంధిత మార్పులకు ఉద్దేశించింది ఇది. వేతన విధానం క్రమబద్ధీకరణకు సంబంధించి అన్ని పే స్కేల్స్‌ను కలపాలనేది ఈ ప్రతిపాదన.  

1 /11

8వ వేతన సంఘంతో పెన్షనర్లకు కూడా భారీ ప్రయోజనం కలుగుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతంగా నిర్ణయిస్తే పెన్షన్ 30 శాతం పెరుగుతుంది. కనీస పెన్షన్ 9 వేల నుంచి 25,740 రూపాయలు కానుంది. 

2 /11

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటే వేతనాలు ఎంత పెరుగుతాయనేది చూద్దాం. 18 వేల కనీస వేతనం ఉంటే 51,480 రూపాయలు అవుతుంది. 25 వేలు కనీస వేతనం ఉంటే 71,500 రూపాయలు కానుంది. 35 వేలు కనీస వేతనం ఉంటే 1 లక్ష రూపాయలు అవుతుంది. 50 వేలు ఉన్నవారికి 1.42 లక్షలు అవుతుంది. 

3 /11

8వ వేతన సంఘం కోసం ప్రభుత్వం త్వరలో ఒక ఛైర్మన్, ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనుంది. ఈ సంఘం 12 నెలల్లో ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించాల్సి ఉంటుంది. 

4 /11

8వ వేతన సంఘం సిఫార్సుల్ని సమీక్షించేందుకు స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. ఈ ప్రతిపాదనలు ఆమోదిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గణనీయంగా మార్పు జరుగుతుంది.

5 /11

పే స్కేల్స్ విలీనంతో పాటు కనీస వేతనం, పెన్షన్, డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ తక్షణం లింక్ చేయాలని ఉద్యోగులు పట్టుబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లపై ద్రవ్యోల్బణం ప్రభావం తగ్గించేందుకు దోహదమౌతుంది. 

6 /11

ఇక లెవెల్ 3, లెవెల్ 4 విలీనం చేస్తే ఉద్యోగులకు సవరించిన వేతనం 72,930 రూపాయలు అవుతుంది. లెవెల్ 5, లెవెల్ 6ఉ్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 చేస్తే కనీస వేతనం 1.01,244 రూపాయలు అవుతుంది. 

7 /11

ప్రస్తుతం లెవెల్ 1 ఉద్యోగులకు కనీస వేతనం 18 వేల రూపాయలు వస్తుంది. లెవెల్ 2 ఉద్యోగులకు 19 వేలు వస్తోంది. వీటిని ఒకదానితో ఒకటి విలీనం చేస్తే కొత్త పే స్కేల్ మొదలవుతుంది. లెవెల్ 1 ఉద్యోగులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86గా నిర్ణయిస్తే కనీస వేతనం 51,480 రూపాయలు అవుతుంది. 

8 /11

అన్ని వేతన విధానాలు విలీనం చేయడం ద్వారా వేతన పెంపులో ఉండే వ్యత్యాసం తగ్గించవచ్చు. స్పష్టమైన విధానాన్ని రూపొందించవచ్చు. ఆర్ధిక వృద్ధికి తోడ్పడుతుంది. 

9 /11

8వ వేతన సంఘం కోసం కొన్ని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో ముఖ్యమైంది కనీస వేతన విధానాలు ఏకీకరించడం. అంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకూ అన్ని వేతన విధానాలకు కలపడం. 

10 /11

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో పే స్కేల్స్ 1 నుంచి 6 వరకు అన్నింటినీ మిళితం చేయాలనేది ప్రధాన సూచన. మొత్తం 18 పే స్కేల్స్ ఉంటాయి. 7వ వేతన సంఘం ప్రకారం లెవెల్ 1 ఉద్యోగులకు కనీస వేతనం 18 వేలు, లెవెల్ 18లో ఉద్యోగులకు 2.50 లక్షలు ఉంది. 

11 /11

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఈ మధ్యనే 8వ వేతన సంఘానికి సంబంధించిన నిబంధనలు, విధి విధానాలు ఖరారు చేసేందుకు నేషనల్ కౌన్సిల్ నుంచి సమాచారం కోరింది. ఇందులో కీలకమైన అంశాలు ఉన్నాయి.