Ajwain benefits: చిటికెడు వాము నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే బిత్తర పోతారు..

Ajwain Health benefits: వాముని మనం వంటల్లో వినియోగిస్తాం.. బామ్మల కాలం నుండి దగ్గు, జలుబు, జ్వరం కషాయం వాటికి వినియోగిస్తారు. వామును తీసుకోవడం వల్ల కూడా శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చిటికెడు వాము నమలడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? 
 

1 /5

వాము నమలడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. వాము జీర్ణ ఎంజైమ్‌త ఉత్పత్తికి తోడ్పడుతుంది. మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కడుపులో గ్యాస్, అజీర్తికి తోడ్పడుతుంది. వాము యాసిడిటీ, గుండె మంట సమస్యను నివారిస్తుంది.   

2 /5

వాము తీసుకోవటం వల్ల కడుపునొప్పి, తలనొప్పి సమస్య కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా పంటి నొప్పి సమస్య ఉన్నవాళ్లు వాము తీసుకోవాలి.. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీంతో నొప్పి సమస్యను తగ్గిస్తాయి.   

3 /5

బరువు తగ్గాలనుకునేవారు రోజు ఉదయం పరగడుపున వాము నీటిని తీసుకోవాలి. దీంతో మెటబాలిజం రేటు పెరుగుతుంది. అధికంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది. వాము జీవన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుతుంది.   

4 /5

 అంతేకాదు చర్మ ఆరోగ్యానికి కూడా వాము మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.. మీ చర్మం పై ఉండే యాక్నే, ఎగ్జిమా సమస్యలను ఇది తగ్గిస్తుంది. వాము డీటాక్సిఫైయర్‌లా పనిచేసి మన శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపిస్తుంది.   

5 /5

వాము తరచూ తీసుకోవటం వల్ల ఇందులో ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచే గుణాలు ఉంటాయి.. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్‌ ఆయిల్స్ ఉంటాయి. దీంతో ఇది సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది.