EPFO Updates: పీఎఫ్‌ ఖాతాదారులకు డబుల్ జాక్‌పాట్.. ఒకేసారి రెండు శుభవార్తలు..!

PF Pension Hike News: కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్‌న్యూస్‌లను ప్రకటిస్తోంది. ఇటీవల బడ్జెట్‌లో ట్యాక్స్‌ పేయర్లకు కేంద్రం బంపర్ న్యూస్ ప్రకటించగా.. ఇవాళ లోన్లు చెల్లించే వారికి ఆర్‌బీఐ అదిరిపోయే న్యూస్ చెప్పింది. అతి త్వరలోనే ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కూడా తీపికబురు అందనుంది. జీతం, పెన్షన్ రెండింటిలోనూ భారీ పెంపుదల కనిపించే అవకాశం కనిపిస్తోంది.
 

1 /7

2024-25 సంవత్సరానికి పీఎఫ్‌పై వడ్డీ రేటును పెంచే అవకాశం కనిపిస్తోంది. గత రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును పెంచింది. 2022-23లో 8.15 శాతానికి పెంచగా.. 2023-24లో 8.25 శాతానికి పెంచారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటు పెంపుపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.  

2 /7

ఈపీఎఫ్‌ సభ్యులకు ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 కింద జీతం పరిమితిని కూడా పెంచేందుకు కేంద్రం యోచిస్తోంది. రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచాలని ప్లాన్ చేస్తోంది.  

3 /7

అదేవిధంగా కనీస పెన్షన్‌ను కూడా రూ.1,000 నుంచి రూ.7,500 వరకు పెంచేందుకు ప్రణాళికలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

4 /7

రూ.21 వేలు కనీస వేతనం అయితే.. కంపెనీ సహకారం కూడా పెరుగుతుంది. అప్పుడు రూ.21 వేలపై కంపెనీ సహకారం 8.33 శాతం ఉంటుంది. పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరిగే కొద్ది.. పెన్షన్ ఫండ్ కూడా పెరుగుతుంది.  

5 /7

రూ.21 వేలు కనీస వేతనం అయితే.. కంపెనీ సహకారం కూడా పెరుగుతుంది. అప్పుడు రూ.21 వేలపై కంపెనీ సహకారం 8.33 శాతం ఉంటుంది. పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరిగే కొద్ది.. పెన్షన్ ఫండ్ కూడా పెరుగుతుంది.  

6 /7

EPS కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500 పెంచాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను EPS-95 పెన్షనర్లు  కలిసి.. కనీస పెన్షన్‌ను రూ.7,500కి పెంచాలని ఇప్పటికే డిమాండ్ చేశారు.   

7 /7

యూపీఎస్ పెన్షన్ స్కీమ్‌ను కేంద్రం తీసుకువచ్చినప్పటి నుంచి పెన్షన్ పెంచాలనే డిమాండ్ ఎక్కువగా ఉంది. నెలవారీ పెన్షన్‌ పెంచితే.. 7 కోట్లకు పైగా పీఎఫ్ ఖాతాదారులకు భారీ లబ్ధి చేకూరుతుంది.