AP Govt Jobs Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతకు బంఫర్ గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
AP Govt Jobs Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ఇప్పటికే ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు ప్రభుత్వం దరఖాస్తులను కోరుతోంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్యతో పాటు కుటుంబ సంక్షేమ శాఖలలో ఖాళీ ఉన్న వివిధ పోస్టులకు గానూ భర్తీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అయితే ఈ నోటిఫికేషన్‌లో కొన్ని ప్రత్యేకమైన ఆర్హతలను కూడా పేర్కొన్నారు.
ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఉద్యోగాలకు అర్హత కలిగి అభ్యర్థులు ఫిబ్రవరి 22వ తేదీలోపు అప్లికేషన్ పెట్టుకోవాలని కోరారు. అంతేకాకుండా ఈ నోటిఫికేష్‌లో పూర్తి వివరాలను కూడా వెల్లడించారు.
ఇక ఈ నోటిఫికేషన్‌లలో విద్యార్హతల వివరాల్లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం పోస్టుల సంఖ్య 66 కాగా పదో తరగతి నుంచి డిగ్రీ, ఇతర పై చదువులు చదువుకున్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఇక ఈ నోటిఫికేషన్‌ను శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ అధికారులు నేరుగా తిరుపతి నుంచి విడుదల చేసినట్లు తెలుస్తోంది. మొదటగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆరోగ్య సంస్థల్లో ఖాళీలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయబోతున్నారు.
ఇందులో ఉండే బేసిక్ ఉద్యోగం ల్యాబ్ అటెండెంట్ జీతం రూ.15,000 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఇందులోనే జీతం ఫిజియోథెరపిస్ట్ జీతం రూ.35,570 నుంచి ప్రారంభమవుతుంది. పోస్టును బట్టి ఈ జీతాలను అందించనున్నారు.
ఇక ఈ నోటిఫికేషల్‌లో తెలిపిన పోస్టులకు సంబంధించిన విద్యార్హాతల వివరాల్లోకి వెళితే.. పదో నుంచి B.Sc (MLT) చేసిన వారిని అభ్యర్థులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అలాగే బిఎస్‌సి ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చదువుకున్న వ్యక్తులు కూడా అర్హులుగా నోటిఫికేషన్‌లో తెలిపారు.