Triptii Dimri: తెలుగులో క్రేజీ స్టార్ హీరో మూవీతో ఎంట్రీ ఇస్తున్న యానిమల్ బ్యూటీ .. తృప్తి డిమ్రి క్రేజ్ మాములుగా లేదుగా..

1 /7

Triptii Dimri:  యానిమల్ చిత్రంతో  తృప్తి డిమ్రీ ఒక్కసారిగా ఫేమస్ అయింది. అంతేకాదు  హాట్ స్కిన్ షోకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ భామను సోషల్ మీడియాలో  ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.  లాస్ట్ ఇయర్ ‘బ్యాడ్ న్యూస్’, ‘భూల్ భులయ్యా 3’  వరుస సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంది.

2 /7

తృప్తి నటించిన ‘బ్యాడ్ న్యూస్’ అనే బూతు చిత్రానికి క్రిటిక్స్ ఏకి పారేసినా.. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం దాదాపు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావడం ఆమె క్రేజ్ కు ఉన్న నిదర్శనం.

3 /7

తృప్తి హిందీలో వరుస చిత్రాలు చేస్తూనే.. ప్రభాస్ ‘ది రాజా సాబ్’లో స్పెషల్ సాంగ్ చేయనుందట.  మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలతో ఓ ఐటెం సాంగ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

4 /7

తృప్తి డిమ్రీ కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన దాదాపు 9 యేళ్లు అవుతున్నా.. సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి.20223 చివర్లో తెలుగు దర్శకుడు  సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ‘యానిమల్’ చిత్రంతో  ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకుంది.

5 /7

అంతేకాదు తృప్తి.. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తోన్న స్పిరిట్ తో పాటు.. ‘యానిమల్ పార్క్’ సినిమాల్లో నటిస్తోందట. త్వరలో ‘ది రాజా సాబ్’మూవీతో తెలుగులో అడుగు పెట్టబోతుంది. మరవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ తృప్తి కోసమే  స్పెషల్ సాంగ్స్ ను  ఈమె కోసమే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  

6 /7

తృప్తి విషయానికొస్తే.. 2017లో శ్రీదేవి ముఖ్యపాత్రలో నటించిన  ‘మామ్’ చిత్రంలో  చిన్న పాత్రతో  సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత సన్ని దేవోల్, బాబీ దేవోల్ ల ‘పోస్టర్ బాయ్’ చిత్రంలో నటించింది.   2021లో  ఫోర్బ్స్  అండర్ 30 లిస్టులో తృప్తి డిమ్రి  పేరు చేరింది. తృప్తి 23 ఫిబ్రవరి 1994లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గర్వాల్ లో జన్మించింది.

7 /7

2018లో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా ‘లైలా మజ్ను’ సినిమాతో యాక్ట్రెస్ గా  మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు 2020లో వచ్చిన బుల్ బుల్, ఖాలా సినిమాలు తృప్తికి మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ‘యానిమల్’ సినిమాతో మాత్రం తృప్తికి ప్యాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి.