Naga Chaitanya Recent movies 1st Day Collections: అక్కినేని కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పటికీ మిడ్ రేంజ్ హీరోగా మిగిలిపోయాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా సినిమా సినిమాకు తన బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ‘తండేల్’ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ రెండు తెలుగు స్టేట్స్ తో ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..
‘తండేల్’ మూవీ నాగ చైతన్య కెరీర్ లోనే హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. సోలో హీరోగా నటించిన సినిమాల ఫష్ట్ డే కలెక్షన్స్ కలెక్షన్స్ యానికొస్తే..అందులో బంగార్రాజు, వెంకీ మామ సినిమాలను పక్కన పెడితే..
తండేల్.. నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి డైరెక్షన్ లో అల్లు అరవింద్ సమర్ఫణలో బన్ని వాసు నిర్మాత తెరకెక్కించిన చిత్రం తండేల్. ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 9 కోట్ల షేర్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.
కస్టడీ.. నాగ చైతన్య హీరోగా తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.82 కోట్ల షేర్ రాబట్టింది.
థాంక్యూ.. నాగ చైతన్య విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘థాంక్యూ’. ఈ చిత్రం తొలిరోజు రూ. 1.65 కోట్ల షేర్ రాబట్టింది.
లవ్ స్టోరీ.. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా ఫస్ట్ డే రూ. 7.13 కోట్ల షేర్ రాబట్టి అప్పటి వరకు హైయ్యెస్ట్ ఫస్ట్ డే షేర్ మూవీగా ఉండే.
మజిలీ.. నాగ చైతన్య, సమంత జోడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజిలి’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.6 కోట్ల షేర్ రాబట్టింది.
సవ్యసాచి.. నాగ చైతన్య, చందూ మొండేటి కాంబోలో వచ్చిన రెండో సినిమా ‘సవ్యసాచి’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.29 కోట్ల షేర్ రాబట్టింది.
శైలజా రెడ్డి అల్లుడు.. నాగ చైతన్య, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.93 కోట్ల షేర్ రాబట్టింది. అప్పటి వరకు చైతూ సోలో హీరోగా బిగ్గెస్ట్ ఓపెనర్.
బంగార్రాజు - వెంకీ మామ.. నాగ చైతన్య తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన చిత్రం ‘బంగార్రాజు’. ఈ సినిమా రూ. 9.06 కోట్ల షేర్ రాబట్టింది. అటు వెంకీ మామ సినిమా రూ. 7.05 కోట్ల తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రాబట్టింది.