BJP Tremendous Victory: దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి 26 ఏళ్ల తరువాత ఢిల్లీలో అధికారాన్ని చేపట్టనుంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని ఘోరంగా ఓడించిన కాషాయ పార్టీ కొన్ని రోజుల్లో బాధ్యతలు స్వీకరించనుంది. గత ఎన్నికల్లో తీవ్రంగా విఫలమైన కమలం పార్టీ తాజా ఎన్నికల్లో అధికారాన్ని సొంతం చేసుకోవడానికి కారణాలు ఏమిటో తెలసుకుందాం.
Also Read: Foreign Liquor: మద్యం ప్రియులకు జాక్‌పాట్.. ఒకే దుకాణం మూడు బ్రాండ్ల మద్యం
బీజేపీ విజయానికి టాప్ 10 కారణాలు
- మూడు పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని దక్కించుకున్నా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం జెండా ఎగరవేయలేకపోవడంతో ఢిల్లీపై బీజేపీ దృష్టి సారించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కొన్ని సంవత్సరాల నుంచే ముందస్తు ప్రణాళికతో బీజేపీ ముందుకు సాగింది.
- ఆప్‌కు ఎలాంటి ఇవ్వకుండా అధికారాన్ని దక్కించుకోవాలని పక్కా ప్రణాళికతో బీజేపీ ముందుకు వెళ్లింది. పక్కా సోషల్ ఇంజినీరింగ్ చేపట్టడంతో పాటు ఆప్‌కు ధీటుగా హామీలను ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ కమలం పార్టీ మేనిఫెస్టో రూపొందించింది.
- క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్తోపాటు ఇతర బీజేపీ అనుబంధ సంస్థలు పని చేశాయి. ఆప్ పదేళ్ల వైఫల్యాలను బలంగా ప్రజలకు చెప్పడంలో విజయవంతమైంది.
- ఢిల్లీ మద్యం కుంభకోణం అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా కాషాయ దళం పని చేసింది. మనీశ్ సిసొడియా, అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడాన్ని ప్రధానంగా ప్రస్తావించింది.
- ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన పునాదిగా ఉన్న సామాన్య, మధ్య తరగతి ఓటర్లను బీజేపీ ఆకర్షించింది. కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిమయమైందని చెప్పడంలో కమలం పార్టీ సఫలీకృతమైంది. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ శేశ్ మహల్ నివాసాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపించేలా చేసింది.
- ఇండియా కూటమిగా జత కట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయలేదు. ఎన్నికల సమయంలో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయకపోవడం బీజేపీ కలిసి వచ్చింది. వారి చీలిక కమలం పార్టీకి మేల చేసింది.
- ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ చీల్చడంతో బీజేపీకి కలిసొచ్చింది. ఆప్, కాంగ్రెస్‌కి కలిపి 50 శాతం వరకు ఓట్ షేరింగ్ రాగా మిగతా కమలం పార్టీ వైపు మళ్లింది.
- ప్రతి బూత్‌లో కనీసం 50 శాతం ఓట్లు సాధించేలా బీజేపీ కార్యకర్తలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అసెంబ్లీ స్థాయిలో గతంలో సాధించిన కంటే 20 వేల ఓట్లను అధికంగా సాధించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది.
- కొన్ని నెలలుగా బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను బీజేపీ క్షుణ్ణంగా పరిశీలించింది. పార్టీ అనుకూల, వ్యతిరేక ఓటర్లపై కచ్చితమైన అంచనాకు వచ్చింది. వ్యతిరేక ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు వారితో చర్చలు జరిపి తమ వైపునకు బీజేపీ తిప్పేసుకుంది.
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా కూడా పని చేసింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీకి అవకాశం ఇచ్చిన ఢిల్లీ ఓటర్లు బీజేపీకి ఒకసారి అవకాశం ఇద్దామని భావించడంతో హస్తినలో కమలం వికసించిందని చెప్పవచ్చు.
Also Read: KA Paul: 'ట్రంప్ భారతదేశ పౌరులను తరిమేస్తుంటే.. ప్రధాని మోదీ ఏం చేస్తున్నారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.