Chiranjeevi: మోడీ టీమ్ లోకి మెగాస్టార్ ఎంట్రీ.. చిరంజీవికి కీలక పదవి..

Chiranjeevi joins Modi Team: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీకి తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వీలైనపుడల్లా తన అభిమానం చాటుకుంటూనే ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ అన్యయ్య చిరంజీవికి ప్రధాని నరేంద్ర మోడీ మంచి గౌరవం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుకు అనుకున్నట్టుగానే నరేంద్ర మోడీ కీలమైన తన టీమ్ లోకి తీసుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 8, 2025, 12:06 PM IST
Chiranjeevi: మోడీ టీమ్ లోకి మెగాస్టార్ ఎంట్రీ.. చిరంజీవికి కీలక పదవి..

Chiranjeevi joins Modi Team: కేంద్రంలోని నరేంద్ర మోడీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. అటు మెగా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే.. అటు నందమూరి.. అక్కినేని ఫ్యామిలీలతో కూడా సఖ్యతగా మెలుగుతున్నారు. మొత్తంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అన్ని మేజర్ ఫ్యామిలీస్ కు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మన దేశాన్ని గ్లోబల్ ఎంర్టైన్మెంట్ హబ్ మార్చడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ యేడాది చివర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను నిర్వహించనున్న విషయం తెలిసిందే కదా. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి దేశంలో విభిన్న రంగాల్లో ఉన్నవారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ నేపథ్యంలో విభిన్న రంగాల్లో ఉన్న వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు.  ఈ అడ్వైజరి బోర్డులో తెలుగు నుంచి చిరంజీవికి స్థానం దక్కింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి.. ప్రధాన మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

అంతేకాదు మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాడ్లాడుతున్న వీడియోను పంచుకున్నారు. మరోవైపు ఈ అడ్వైజరీ బోర్డులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో పాటు  నాగార్జున, రజినీకాంత్, ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, దీపికా పదుకొణే, హేమా మాలిని సహా పలువురు భాగస్వామ్యం అయి తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

ఈ భేటిలో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా కూడా సమ్మిట్ లో పాల్గొని వారి అభిప్రాయాలను తెలిపారు. చిరంజీవి విషయానికొస్తే.. చిరంజీవి కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్ పదవి కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. దాంతో పాటు బాబీ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడితో పాటు మారుతి సినిమాలు లైన్ లో ఉన్నాయి.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News