AP Politics: ఏపీలో ఇప్పుడిప్పుడే ఎన్నికలు లేకపోయినా మిషన్ 2029 కోసం రాజకీయ పార్టీలు అప్పుడే సిద్ధమౌతున్నాయి. త్వరలో జగన్ 2.0 చూస్తారంటూ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చిన జగన్ అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్‌తో తాజాగా ఢిల్లీలో మంత్రి నారా లోకేశ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కోసం పనిచేసిన కీలక వ్యక్తి జగన్ టీమ్ కు జత చేరనున్నారని సమాచారం.
ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తను రంగంలో దింపింది తొలిసారిగా వైఎస్ జగన్ మాత్రమే. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సారధ్యంలోని ఐప్యాక్ టీమ్ సేవలు అందించింది. ఆ ఎన్నికల్లో జగన్ 151 సీట్లతో భారీ విజయం సాధించారు. ఆ తరువాత ప్రశాంత్ కిశోర్ ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ టీమ్‌లో ఉన్న కీలకమైన వ్యక్తులు రాబిన్ శర్మ-శంతన్లు సొంతంగా ఏర్పాటు చేసుకున్న షో టైమ్ కన్సల్టెన్సీ 2024లో చంద్రబాబు కోసం పనిచేసింది. ఎన్నికల సమయంలో ప్రశాంతం కిషోర్ తెర వెనుక నుంచి చంద్రబాబుకు సూచనలు అందించారు. అటు షో టైమ్ కన్సల్టెన్సీ వ్యూహాలు, ప్రచార శైలి తెలుగుదేశం పార్టీకు కలిసొచ్చింది. ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు విషయంలో చేసిన సూచనలు సానుకూల పరిణామాలిచ్చాయి. ఎన్నికల వ్యూహాలు, పార్టీపరంగా నిర్ణయాలలో శంతన్ కీలకమైన పాత్ర పోషించారు.
ఇప్పుడు రానున్న ఎన్నికలకు అంటే 2029 లేదా జమిలి వస్తే 2027 ఎన్నికలకు ఇప్పటి నుంచే సంసిద్ధమయ్యేందుకు వైఎస్ జగన్ ఆలోచన చేస్తున్నారు. ఉగాది నుంచి నియోజకవర్గాల పర్యటన, పార్టీ కార్యకర్తలతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్లేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా షో టైమ్ కన్సల్టెన్సీకు చెందిన శంతన్ రంగంలో దిగనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఇరువురి మధ్య దీనికి సంబంధించి ఒప్పందం జరిగినట్టు సమాచారం.
వచ్చే నెలలో అంటే మార్చ్ 12న జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఒప్పందం అమల్లోకి రావచ్చని సమాచారం. దీనిపై పార్టీ నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు.
Also read: School Girl Gang Rape: టీచర్లు కాదు..కీచకులు, విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి