Illegal Indian Immigrants: అమెరికా నుంచి అక్రమ వలసల గెంటివేత షురూ, 205 మందితో తొలి విమానం

Illegal Indian Immigrants: అక్రమ వలసలపై అగ్రరాజ్యం అమెరికా చర్యలు మొదలయ్యాయి. భారత వలసదారులతో కూడిన తొలి విమానం ఇండియాకు చేరింది. తొలిదశలో 205 మంది భారతీయులు స్వదేశానికి చేరారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 5, 2025, 09:48 AM IST
Illegal Indian Immigrants: అమెరికా నుంచి అక్రమ వలసల గెంటివేత షురూ, 205 మందితో తొలి విమానం

Illegal Indian Immigrants: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసలపై దృష్టి పెట్టిన ట్రంప్ ఆ దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న 7.25 లక్షలమంది ఇండియన్స్‌ను వెనక్కి తరలిస్తున్నారు. యుద్ధ విమానాలతో తరలింపు ప్రక్రియకు భారీగా ఖర్చు పెడుతోంది అమెరికా ప్రభుత్వం.

అమెరికాలో అక్రమ వలసదారులపై అణచివేత ప్రారంభమైంది. డాలర్ల మోజులో అభద్రత, భయంతో జీవిస్తూ వచ్చిన అక్రమ వలసదారులు ఇక ఇండియాకు వచ్చేస్తున్నారు. చరిత్రలో తొలిసారిగా మిలిటరీ విమానాల్లో అక్రమ వలసదారుల్ని స్వదేశాలకు తరలించే ప్రక్రియ ప్రారంభించింది. అమెరికా సీ 17 యుద్ధ విమానంలో 205 మంది వలసదారుల్ని ఇండియాకు తరలించారు. శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన తొలి విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. తొలి దశలో 20 వేలమంది భారతీయుల్ని తరలించేందుకు అమెరికా సిద్ధమైంది. తొలి విమానం అమృతసర్‌కే ఎందుకంటే ఆ దేశంలో అక్రమంగా వలస ఉంటున్నవారిలో అగ్రస్థానం పంజాబీలు కాగా రెండో స్థానంలో గుజరాతీలున్నారు. వీళ్ళంతా వేర్వేరు సమయాల్లో డంకీ రూట్‌లో అక్కడికి వలసవెళ్లినవాళ్లే. 

అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మొత్తం 20 వేల మంది డాక్యుమెంట్లు లేని భారతీయుల జాబితాను రూపొందించింది. ముందుగా టెక్సాస్‌లోని ఎల్ పాసూ, కాల్నిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి 5 వేలమందిని బహిష్కరించాలని పెంటగాన్ నిర్ణయించింది. మెక్సికో, ఎల్ సాల్వడార్ తరువాత భారీ సంఖ్యలో అక్రమ వలసదారులు ఇండియా నుంచే ఉన్నారు. 

అక్రమ వలసల తరలింపుకు భారీ ఖర్చు

అక్రమ వలసదారులపై నిఘా పెట్టిన అమెరికా ఖర్చుకు వెనుకాడటం లేదు. ఎన్నడూ లేనంత ఖర్చు పెట్టి వలసదారుల్ని ఆయా దేశాలకు యుద్ధ విమానాల్లో తరలింపు ప్రారంభించింది. అమెరికా నుంచి ఇండియాకు తరలించేందుకు ఒక్కొక్కరిపై 4 వేల 675 డాలర్లు అంటే 4 లక్షల 6 వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. తొలి దశలో వచ్చిన 205 మందిపై అప్పుడే 8 కోట్ల 33 లక్షల రూపాయలు వెచ్చించింది. మొత్తం 7.25 లక్షల మందిని తరలించేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది. 

Also read: US President Donald Trump: అమెరికాలో ట్రంప్ అరాచకం.. ఏకంగా 205 మంది వెనక్కి పంపిప అగ్ర దేశాధినేత..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News