US President Donald Trump: అమెరికాలో ట్రంప్ అరాచకం.. ఏకంగా 205 మంది వెనక్కి పంపిప అగ్ర దేశాధినేత..

US President Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్ట్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నాడు. అమెరికా ఫస్ట్ నినాదం ముందు ఎవరిని లెక్క చేయడం లేదు. ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారి ఏరివాత కార్యక్రమం కంటిన్యూగా నడుస్తూనే ఉంది. తాజాగా  అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారత్ కు చెందిన వారిని మన దేశానికి డిపోర్ట్ చేస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 4, 2025, 12:26 PM IST
US President Donald Trump: అమెరికాలో ట్రంప్ అరాచకం.. ఏకంగా 205 మంది వెనక్కి పంపిప అగ్ర దేశాధినేత..

US President Donald Trump: అక్రమవలసదారులపై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరాచకం అనే కంటే సాధారణ అమెరికన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అదే చేస్తున్నారు. ఆ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులపై  ఏ మాత్రం కనికరం లేకుండా వెనక్కి పంపివేస్తున్నాడు. ఇందుకోసం అధ్యక్షుడు అయినప్పటి  నుంచి వలసదారులపై ప్రత్యేక ఆపరేషన్ మొదలు పెట్టాడు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌ సాగుతోంది. ఈ టైంలో అమెరికాకు అక్రమంగా వలసవెళ్లిన భారతీయులను విమానంలో వెనక్కి తరలిస్తున్నారు. ఇప్పటికే   ఓ విమానం భారత్ కు  బయల్దేరింది. అందులో 205 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.

సీ-17 యూఎస్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ వీరిని తరలిస్తోంది. భారత్‌కు చేరుకోవడానికి 24 గంటలు పడుతుందని అంచనా. అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ఇప్పటికే భారత్‌ తన స్పందనను తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని ప్రకటించింది.  ఈ అంశం అనేకరకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా లేదా సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ తరుణంలో అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల తొలివిడత తరలింపు జరుగుతోంది..

అక్రమవలసదారులపై ట్రంప్‌ మొదటి నుంచి కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారి గుర్తింపు, తరలింపు ప్రక్రియను స్పీడప్ చేశారు. అక్రమ వలసదారులను గుర్తించడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ముందుగా 538 మందిని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు. ఇక ఎల్‌ పాసో, టెక్సాస్, శాన్‌ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్‌ రెడీ అయ్యింది. ఇప్పటికే గ్వాటేమాలా, పెరు, హోండూరస్‌ తదితర దేశాలకు యూఎస్‌ విమానాల్లో పలువురిని తరలించింది. ఇక ఒక్కొక్క వలసదారుడిని తరలించేందుకు అమెరికాకు భారీ ఖర్చు పెడుతోంది. గతవారం గ్వాటెమాలాకు తరలించిన ఒక్కో వ్యక్తిపై అమెరికా సుమారు 4,675 డాలర్లను ఖర్చు పెట్టింది.

అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్‌ తన అభిప్రాయాన్ని తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, వీసా గడువు ముగిసినా లేదా సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. యూఎస్‌లో సరైన పత్రాలు లేకుండా భారత్‌కు చెందిన వలసదారులు 7 లక్షల 25వేల మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 18వేల మందిని భారత్‌కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది. మెక్సికో, సాల్వెడార్‌ ప్రజల తర్వాత అమెరికాలో అక్రమంగా ఉంటున్నది భారతీయులే.  

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ట్రంప్ అధ్యక్షుడయ్యాక ముందుగా  538 మందిని అరెస్ట్ చేసి ఆయా దేశాలకు తరలించారు. అలాగే, ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉంటున్న దాదాపు 5 వేల మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్​ తో జరిగిన చర్చల్లో ట్రంప్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. తమ దేశంలోని భారతీయుల అక్రమ వలసలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్మిగ్రేషన్ గురించి ప్రధాని మోడీతో చర్చించానని, అక్రమ వలసదారులను వెనక్కి రప్పించే విషయంలో భారత్ సరైన విధంగా స్పందిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కొందరు అమెరికా వచ్చాక పిల్లలకు జన్మనివ్వడంతో వారు అమెరికా పౌరులుగా మారిపోయారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ట్రంప్‌ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలిరోజే జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేయడం తెలిసిందే. ఈ ఉత్తర్వులపై సియాటెల్‌ ఫెడరల్‌ కోర్టు స్టే విధించింది. ట్రంప్‌ ప్రభుత్వ బెదిరింపులు డాక్యుమెంట్లు లేని వలసదారులను అమెరికా చేరుకోకుండా ఆపలేకపోతున్నాయి. ఎన్ని భయాలున్నప్పటికీ అమెరికన్‌ డ్రీమ్‌ ప్రయత్నాలను ఆపడం లేదు. కలను నిజం చేసుకోవడానికి జీవితాలనే పణంగా పెడుతున్నారు.  

మెక్సికో, కెనడాలపై విధించదలుకున్న 25 శాతం సుంకాలను అమెరికా నెలరోజుల పాటు నిలిపివేయడానికి నిర్ణయించింది. ఇరు దేశాల అధినేతలు అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తాయని హామీ ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాలు 10వేల మంది భద్రతా బలగాలను తమ సరిహద్దులకు పంపించి మత్తుపదార్థాలు, మనుషుల అక్రమ రవాణాను అడ్డుకుంటామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News