KP Chowdary Suicide: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కబాలి సినిమా తెలుగులో విడుదల చేసిన నిర్మాత తర్వాత నష్టాలు రావడంతో అడ్డదారులు పట్టి పోలీసులకు చిక్కాడు. అనంతరం బయటకు వచ్చిన నిర్మాత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఈక్రమంలోనే గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి ఆత్మహత్య సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. అతడి ఆత్మహత్య కారణాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణకు చెందిన సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి సినీ నిర్మాతగా కొనసాగుతుండేవారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలీ'ని తెలుగులో కేపీ చౌదరి విడుదల చేశారు. అయితే సినీ పరిశ్రమలో పలు సినిమాలు నిర్మించినా కూడా లాభాలు రాకపోవడంతో డ్రగ్స్ వ్యవహారాలు నడిపించేవాడు. డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి గతంలో జైలుకు వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న చౌదరి వాటిని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నారు.
గోవాలో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి పోలీసులు చౌదరి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే వారు గోవాకు తరలివెళ్లారు. అతడి ఆత్మహత్య వార్త సినీ పరిశ్రమలో విషాదం నింపింది. అక్కడి పోలీస్ ప్రక్రియ ముగిసిన అనంతరం మృతదేహాన్ని స్వస్థలం ఖమ్మం తరలించే అవకాశం ఉంది. ఈ వార్తతో కేపీ చౌదరి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డైరెక్టర్ ఆపరేషన్స్ విభాగంలో పని చేశారు. అనంతరం 2016లో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. రజనీకాంత్ 'కబాలీ' సినిమాను తెలుగులో నిర్మించిన చౌదరి తర్వాత సర్దార్ గబ్బర్‌సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, తమిళ సినిమా 'కణితన్'ను నిర్మించారు. సినీ పరిశ్రమలోకి వచ్చిన వరుసగా నష్టాలు ఎదుర్కొన్నాడు. ఆర్థికంగా తీవ్ర నష్టాలబాట పట్టడంతో డ్రగ్స్ వ్యవహారాలు నడిపించాడు. తరచూ గోవా వెళ్తూ డ్రగ్స్ వ్యాపారాన్ని హైదరాబాద్‌లో చేసేవాడు. డ్రగ్స్ తనిఖీల్లో కేపీ చౌదరి చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడు. విడుదలైన అనంతరం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే గోవాకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని సోమవారం ఉదయం పోలీసులు కనుగొన్నారు.