Union Budget 2025: 2025-26 యేడాదికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పలు రంగాలకు కేటాయించింది.
రూ. 50,65,345 కోట్లతో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో రక్షణ రంగానికి రూ. 4,91,732 కోట్లు కేటాయించింది.హోం మంత్రిత్వ శాఖకు రూ. 2,33,211 కోట్ల కేటాయించింది. గ్రామీణాభివృద్ధికి రూ.2,66,817 కోట్ల కేటాయించింది.
వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు కేటాయించారు. ఎడ్యుకేషన్ రూ. 1,28,650 కోట్లు కేటాయింపులు జరిగాయి. వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 98,311 కోట్లు కేటాయించారు. పట్టాణాభివృద్దికి రూ. 96,777 కోట్ల కేటాయించారు.
ఐటి, టెలికంకు రూ. 95,298 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి రూ. 81,174 కోట్లు కేటాయింపులు చేశారు. వైజ్ఞానికి విభాగాలకు రూ. 55,679 కోట్లు కేటాయించారు. వాణిజ్య, పరిశ్రమలు రూ. 65,553 కోట్లు కేటాయించారు. సామాజిక సంక్షేమ రంగానికి రూ. 60,052కోట్లు కేటాయింపులు జరిపినట్టు సమాచారం.
కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం విషయానికొస్తే..
పన్ను ఆదాయం ద్వారా 22 శాతం సమకూరనుంది. కేంద్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా 5 శాతం లభించనుంది.
జీఎస్టి, ఇతర పన్నుల నుంచి 18 శాతం ఆదాయం సమకూరనుంది. కార్పొరేషన్ పన్ను ద్వారా 17 శాతం..
కస్టమ్స్ ద్వారా... 4 శాతం రానుంది. అప్పులతో కాని క్యాపిటల్ రిసిప్ట్స్ ద్వారా 1 శాతం ఆదాయం.. పన్నేతర ఆదాయం 9 శాతం రానున్నట్టు బడ్జెట్ లో పేర్కొంది. అప్పులు, ఇతర మార్గాల ద్వారా 24 శాతం ఆదాయం సమకూరనుంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
కేంద్ర ఖర్చులు..
కేంద్రం వడ్డీ చెల్లింపులకు 20 శాతం ఖర్చు కానుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16 శాతం కేటాయింపులు జరిపారు.
కీలక సబ్సిడీలకు 6 శాతం.. రక్షణ రంగానికి 8 శాతం కేటాయించారు. రాష్ట్రాలకు పన్నులు, డ్యూటీల ద్వారా చెల్లింపుల్లో 22 శాతం ఖర్చు కానుంది. ఫైనాన్స్ కమిషన్, ఇతర బదిలీల ద్వారా 8 శాతం నిధులు ఖర్చు కానున్నాయి. మరవైపు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8 శాతం ఖర్చు చేయనున్నారు. ఇతర ఖర్చులకు 8 శాతం.. పెన్షన్స్ కు 4 శాతం ఖర్చు కానుంది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.