Nirmala Sitharaman Sarees Significance: కేంద్ర బడ్జెట్ ను సమర్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థికమంత్రి బడ్జెట్ ను సమర్పించేటప్పుడు కట్టుకునే చీరకూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అది భారతీయ సంస్క్రుతిని, వారసత్వాన్ని ప్రదర్శించేలా చేస్తుంది. ప్రతి చీర కూడా భారతదేశంలోని భిన్నమైన సాంస్క్రుతిక వారసత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించే రోజు కట్టుకునే చీరలు కూడా ఎంతో ప్రత్యేకతలను కలిగి ఉంటాయి.
గత ఏడాది నిర్మలమ్మ ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను సమర్పించారు. ఆ సమయంలో నీలిరంగు చీరను ధరించారు. ఇది పశ్చిమబెంగాల్లో లభించే కంఠ ఎంబ్రాయిడరీ. ఈ చీరపై కనిపించే ఆకు డిజైన్ బెంగాల్ కు చెందిన ప్రాచీన ఎంబ్రాయిడరీ వర్క్స్ లో ఒకటి. బెంగాల్ నుంచి ప్రత్యేకంగా ఈ నీలిరంగు చీరను తెప్పించుకుని మరి ఆమె ధరించారు. ఇది ఆక్వా కల్చర్ ఉత్పాదకతను భారతదేశంలోని మత్స్య రంగం అభివ్రుద్ధికి సూచికగా అభివర్ణించారు.
Also Read: Nara Lokesh: 'ఇది జగన్ ప్యాలెస్ కాదయ్యా.. ఎందుకింత బందోబస్తు'.. లోకేశ్ ఆన్ ద ఫైర్
ఇక 2024 -25లో పూర్తి బడ్జెట్ ను సమర్పించేటప్పుడు నిర్మల సీతారామన్ ఏపీకి చెందిన మంగళగిరి చీరు తెప్పించుకుని ధరించారు. మెజంతా రంగు బోర్డర్ తో కూడిన హాఫ్ వైట్ మంగళగిరి చీర ఇది. చూసేందుకు చాలా అద్భుతంగా ఉంది. ఈ చీరును కట్టుకోవడం ద్వారా ఆమె ఏపీకి వ్యవసాయ అవసరాలకు కీలకమైన పోలవరం నీటి పారుదల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేశారు.
Delhi: Union Finance Minister Nirmala Sitharaman is all set to present #UnionBudget2025 in the Parliament today.
She will present and read out the Budget through a tab, instead of the traditional 'bahi khata'. pic.twitter.com/Iky9TSOsNW
— ANI (@ANI) February 1, 2025
2023లో ఆమె బడ్జెట్ ను సమర్పించేందుకు ఎరుపు రంగు చీరను ఎంపిక చేశారు. ఇది టెంపుల్ బార్డర్ చీర. ఈ చీర కర్నాటక ధార్వాడ్ ప్రాంతానికి చెందిన చీర. ఇది చేతితో నేసిన రధాలు, నెమళ్లు, కమలం వంటి డిజైన్లు కలిగి ఉంది. ఆమె కర్నాటక నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు.
Also Read: Gold Rates Today: బడ్జెట్ కు ముందు రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం.. తులం రూ. 85వేలు
2022లో మెరూన్ రంగు చీర ధరించారు. 2021లో ఎరుపు గోధుమ రంగు చీర, 2020లో నీలం రంగు చీరను ధరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook