Two Days Bank Holidays in Budget 2025-26: బ్యాంకు ఉద్యోగులు ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్న రెండు రోజులు బ్యాంకులకు సెలవు దినాలు అమలుపై నేడు 2025-26 బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ఇది అమలు అయితే, ఇక బ్యాంకులు కేవలం ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఇక బ్యాంకు పనివేళల్లో కూడా మార్పులు ఉంటాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
బ్యాంకులో డిపాజిట్లు, విత్‌డ్రా ఇతర కార్యకలాపాలకు వినియోగిస్తాం. ప్రతి ఆదివారంతోపాటు రెండు, నాలుగో శనివారాల్లో ఈ బ్యాంకులు పనిచేయవు. అయితే, ఎన్నో రోజులుగా ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ బ్యాంకులకు 5 రోజులు పనిదినాలుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈనేపథ్యంలో నేటి 2025-26 బడ్జెట్‌లో దీనిపై ఓ నిర్ణయం రానుందని బ్యాంకు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇదే జరిగితే బ్యాంకులు కేవలం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తాయి. ఇప్పటికే బ్యాంకు ఉద్యోగులు, ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ దీనిపై పలుమార్లు సమావేశం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఆర్‌బీఐ నిర్ణయం కూడా ఈ ఐదు రోజుల పనిదినాల అమలుకు తప్పనిసరి. కేంద్రం, ఆర్‌బీఐ ఆమోదం చెబితే ఇక బ్యాంకులు కేవలం ఐదు రోజులు మాత్రమే పనిచేస్తాయి. అంతేకాదు వాటి పని సమయం కూడా పెరుగుతుంది.
ఇక బ్యాంకుల పని వేళలు 40 నిమిషాలు పెరుగుతాయి. అయితే, బ్యాంకులు బంద్ ఉన్నా కానీ, కొన్ని ఆర్థిక లావాదేవీలు మనం నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా నిర్వహించుకోవచ్చు. డబ్బులు ఏటీఎం ద్వారా కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ రెండు రోజులు బ్యాంకులకు సెలవు ఆమోదం తెలిపితే బ్యాంకు కస్టమర్లకు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.
ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు రానున్నాయి. ఈ సెలవులు ఆర్‌బీఐ లేదా స్థానిక ప్రత్యేక దినాలపై ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి నెలలో రెండో, నాలుగో శనివారంతోపాటు ఆదివారాలు, మహా శివరాత్రి మరికొన్ని ప్రత్యేక దినాల నేపథ్యంలో బ్యాంకులు మొత్తంగా 14 రోజులు పనిచేయవు.