Liquor Prise hike: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు కిక్కు దిగే వార్త. మద్యం ధరల పెంపుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. కమిటీ ఇచ్చిన రిపోర్టుపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి మద్యం ధరలను పెంచాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.
Liquor Prise hike: తెలంగాణలో మద్యం ప్రియులకు గవర్నమెంట్ బ్యాడ్ న్యూస్ చెప్పనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి యేడాది పూర్తైయిన సందర్బంగా తెలంగాణలో లిక్కర్ ధరలను పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.
తెలంగాణలో గత నాలుగేళ్ల నుంచి మద్యం ధరలు పెంచకుండా స్థిరంగా ఉన్నాయి. ఇప్పటికే పలు లిక్కర్ కంపెనీలు.. మద్యం రేట్స్ పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ధరల పెంపుపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడానికి ఈ కమిటీ ఓ నివేదినకు ప్రభుత్వానికి అందజేసినట్టు సమాచారం.
సచివాలయంలో గత నాలుగైదు రోజులుగా ఎక్సైజ్ అధికారుల సమావేశమై ఈ అంశంపై చర్చించారు. వచ్చే నెల నుంచి అంటే ఫిబ్రవరి 1 నుంచి మద్యం ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.
బ్రాండెడ్ బీర్లు, బ్రాండెడ్ మద్యం, చీప్ లిక్కర్ ధరలు పెంచాలని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసిందట. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నది.
ప్రీమియం బ్రాండ్స్ అండ్ బీర్లపై 15% మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. చీప్ లిక్కర్ రేట్లను తక్కువ శాతం పెంచాలని ఎక్సైజ్ శాఖ డిసైడ్ అయినట్లు సమాచారం.