Revanth Reddy Shock: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. కాంగ్రెస్ సర్వే బీఆర్ఎస్ హైజాక్..

Revanth Reddy big Shock: తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లకు ఇక్కడ ప్రజలు కృతజ్ఞతతో అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం అనే కంటే బీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ కు అధికారం ప్రజలు కట్టబెట్టేలా చేసింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి యేడాది పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న ఆ పార్టీకి తాజాగా ఓ సర్వే కలవరపెడుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 31, 2025, 02:35 AM IST
Revanth Reddy Shock: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. కాంగ్రెస్ సర్వే బీఆర్ఎస్ హైజాక్..

Revanth Reddy big Shock: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఏడాది పాలనలో ఆరు గ్యారెంటీల్లో కొన్నింటిని ఇప్పటికే అమలు చేసింది. ఈనెల 26 వ తేదీన మరో నాలుగు గ్యారెంటీలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.కానీ ఈ పథకాలు ఎవరికీ అందుతున్నాయన్ని మిలియన్ డాలర్ల ప్రశ్న. అర్హులైన చాలా మందికి సంక్షేమ పథకాలు అందడం లేదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు అనర్హులు ఈ పథకాల వల్ల లబ్ది చేకూరుతుందనే వాదన ప్రజల్లో బలంగా వెళ్లింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  వచ్చిన యేడాదిలోపే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంాి.

తాజాగా కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పడేలా చేసింది. రాష్ట్రంలో ఫామ్‌హౌజ్‌ పాలన కావాలా...  ప్రజల వద్దకు పాలన కావాలా అంటూ ఓ పోల్‌ నిర్వహించారు. ఈ పోల్‌లో అధికార పార్టీకి నెటిజన్లు దిమ్మతిరిగే మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ముఖ్యంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మెజరిటీ సభ్యులు ఫామ్‌ హౌజ్‌ పాలన కావాలని చెప్పటంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరిపాలనపై కాకుండా.. అనవసరమైన విషయాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాడనే వాదనలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా వాళ్లను రేవంత్ రెడ్డి కావాలనే టార్గెట్ చేసాడనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రకటించిన  గద్దర్ అవార్డుల విషయమై ఆ పార్టీలోని మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారట. ఆయన పేరునా.. సినిమా వాళ్లకు కాకుండా.. మాములు సాంస్కృతిక కళాకారులకు తెలంగాణ గాయకులుకు ఇస్తే బాగుంటుంది. అంతేకాదు కొంత మంది సాహిత్య కారులకు గద్దర్ పేరునా అవార్డు ఇవ్వడం శ్రేయస్కరం అంటున్నారు. సినిమాతో సంబంధం లేని ఆయనకు సినిమాతో సంబంధం అంటగట్టడంపై కూడా ప్రజల్లో ఓ వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు రెడ్లను, అగ్ర వర్ణాల వారిని టార్గెట్ చేసిన నేతను కట్టడి చేయకపోవడంపై ఒకింత అసంతృప్తి నెలకొందట. దీనితో పాటు  మంద కృష్ణ మాదిగ వంటి నేతలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వంటివి ఓ వర్గం ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత గూడు కట్టుకనేలా చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News