Revanth Reddy - Vem Narender Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రాణమిత్రుడికి త్వరలో మంత్రి పదవి దక్కుతుందని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ జరగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి అతి త్వరలోనే మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తుంది. రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న వేం నరేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. మరో రెండు నెలల్లో శాసన సభ కోటాలో వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత మంత్రిగా చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి రేవంత్ ఢిల్లీ పెద్దల అనుమతి తీసకున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మార్చి చివరి కల్లా ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీల పదవి కాలం ముగుస్తుంది. ప్రస్తుం శాసన సభలో ఉన్న ఎమ్మెల్యేల ఆధారంగా కాంగ్రెస్ కు రెండు ఎమ్మెల్సీలు దక్కనున్నాయి. వీటిలో ఒకటి వేం నరేందర్ రెడ్డికి ఇవ్వాలనేది సీఎం ఆలోచన. రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడం వల్ల కొన్ని కీలక అంశాల్లో గంటల కొద్దీ రివ్యూ జరపాల్సి వస్తుంది. దీనికి తోడు చాలా కీలకమైన శాఖలు ప్రస్తుతం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. దీంతో ఆయా శాఖలకు సంబంధించిన నిర్ణయాలు ఆలస్యం అవుతుందని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఎలాగో త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది. ఇదే మంచి తరుణం కావడంతో వేం నరేందర్ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకొని ఆయనకు ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న కీలక శాఖలో రెండింటిని అప్పగించాలనుకుంటున్నారట.
తన కష్ట నష్టాల్లో అండగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి రాజకీయంగా ప్రమోషన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం తానే సీఎంగా ఉన్న తరుణంలో వేం నరేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి తన స్నేహాన్ని చాటాలనుకుంటున్నాడట. రాజకీయాల్లో వీరిద్దరు ఆప్త మిత్రులుగా పేరు ఉంది.టీడీపీలో ఉండగా రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి మధ్య స్నేహబంధం ఏర్పడింది. అది మరింత బలపడి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి కష్ట నష్టాల్లో అడుగడుగునా నరేందర్ రెడ్డి ఉన్నారని రేవంత్ సన్నిహితులు చెబుతుంటారు. ఒక రకరంగా చెప్పాలంటే రేవంత్ తన సోదరులను ఏవిధంగా నమ్ముతారో అదే స్థాయిలో నరేందర్ రెడ్డిని నమ్ముతారని ప్రచారంలో ఉంది.
రేవంత్ రెడ్డి గతంలో కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన్న రాజకీయ తీవ్ర ఆటుపోట్లలో కూడా ఆయన రేవంత్ రెడ్డికి చాలా భరోసాగా నిలిచారట. రేవంత్ కుటుంబానికి అండగా ఉండి వారికి మనోధైర్యం కల్పించారట. రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ , రేవంత్ తీసుకున్న రాజకీయ నిర్ణయం ఏదైనా తనకు అండగా నిలిచారట. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరాలని అనుకున్న తరుణంలో కూడా ఆయన రేవంత్ వెంటే నడిచారు.ఏళ్లుగా చంద్రబాబుతో, టీడీపీతో ఉన్న బంధాన్ని కూడా రేవంత్ కోసం తెంచుకున్నారని టాక్. అలాంటి వ్యక్తికి రేవంత్ కూడా అదే స్థాయిలో విలువ ఇస్తున్నారట. రేవంత్ మాటన్నా, నరేందర్ రెడ్డి మాటన్నాఒకటే నట. ఇద్దరి మధ్య అంతలా అవగాహన ఉందట. తాను కలవలేని వాళ్లను రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని కలవమని చెబుతారట. నరేందర్ రెడ్డని కలిస్తే తనను కలిసినట్టే అని రేవంత్ రెడ్డే చెబుతారట.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఈ ఇద్దరి మధ్య ఇంతటి అనుబంధం ఉండడంతో రేవంత్ రెడ్డి వేం నరేందర్ కు మంత్రి పదవి ఇవ్వాలని అనకుంటున్నాడ.ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న కొన్ని ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాయట. అందుకే మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆ సమస్య కూడా ఉండదనేది రేవంత్ భావన. వేం నరేందర్ రెడ్డి మంత్రివర్గంలోకి వస్తే రేవంత్ రెడ్డికి మరింత భరోసా , ధైర్యం వస్తుందని సీఎం అనచరులు చెప్పుకుంటున్నారు. నిజ జీవితంలో స్నేహితుడిగా పక్కన ఉంటూ అండగా నిలబడుతున్న వేం నరేందర్ రెడ్డి, మంత్రిగా కూడా సీఎం రేవంత్ రెడ్డికి అన్ని రకాలుగా అండదండగా ఉండగలడు అనేది ఆ ఇద్దరి నేతల అనచరుల మాట. మొత్తానికి సీఎం భావిస్తన్నట్లు వేం నరేందర్ రెడ్డి మంత్రి అవుతారా లేదా అనేది మాత్రం మరో కొద్ది రోజుల్లో తేలనుంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.