Mahesh Babu: ఫ్రెండ్‌తో ఘాటు ప్రేమలో హీరో మహేశ్ బాబు 'చెల్లెలు'.. త్వరలోనే పెళ్లి?

Mahesh Babu Reel Sister Abhinaya Ready For Marriage: సినీ పరిశ్రమలో మరో నటి వివాహానికి సిద్ధమైంది. తాను ప్రేమిస్తున్న స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఆమెవరో కాదు సూపర్ స్టార్ మహేశ్ బాబు చెల్లెలు. చెల్లి అంటే కుటుంబపరంగా కాకుండా సినిమాలో మహేశ్ కు చెల్లి పాత్ర పోషించిన నటి అభినయ పెళ్లి చేసుకోబోతున్నది.

1 /5

రవితేజ 'నేనింతే' సినిమాతో అభినయ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 'శంభో శివ శంభో'తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎన్టీఆర్ దమ్ము సినిమాలో అక్క పాత్ర పోషించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో హీరోలు మహేశ్ బాబు, వెంకటేశ్ చెల్లెలిగా అభినయ నటించింది.

2 /5

తాజాగా అభినయ నటించిన మలయాళ చిత్రం 'పని' జోజూ జార్జ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రం ఓటీటీలో దుమ్మురేపుతుండగా ఈ సినిమాలో అభినయపై చిత్రీకరించిన అత్యాచార సన్నివేశం వివాదాస్పదమైంది. ఈ వివాదం పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూనే పలు విషయాలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తన పెళ్లిపై మాట్లాడారు.

3 /5

గతంలో హీరో విశాల్ తో వచ్చిన ప్రేమ, పెళ్లి పుకార్లపై కూడా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాల్ తో 'పూజా' చిత్రంలో అభినయ నటించగా... 'మార్క్ ఆంటోని' సినిమాలో విశాల్ కు  భార్యగా నటించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు రాగా పలుచోట్ల వీటిని విశాల్ , అభినయ ఖండించారు. ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని తాజా ఇంటర్వ్యూలోనూ అభినయ తన సైన్ లాంగ్వేజ్ లో తెలిపారు.

4 /5

ఈ ఇంటర్వ్యూలో అభినయ తన పెళ్లి విషయాన్ని ప్రకటించింది. 33 ఏళ్లయినా ఇంకా పెళ్లి ఎందుకు కాలేదని అడగ్గా తన ప్రేమ విషయాన్ని చెప్పింది. 15 ఏళ్లుగా కలిసి చదువుకున్న తన స్నేహితుడిని ప్రేమిస్తున్నానని అభినయ తెలిపింది. త్వరలో అతడిని పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించింది.

5 /5

పుట్టుకతో చెవిటి.‌. మూగ అయిన నటి అభినయ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో అభినయ నటిస్తోంది.