Major Changes in Income Tax: కేంద్ర బడ్జెట్‌కు సమయం ఆసన్నమైంది. రేపు (ఫిబ్రవరి 1) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌పై ట్యాక్స్ పేయర్లు భారీ ఆశలే పెట్టుకున్నారు. పన్ను శ్లాబులు మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను మార్పులు చేస్తే.. మధ్యతరగతి ప్రజలకు గొప్ప ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 7వ సారి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈసారి బడ్జెట్‌పై భారీ ఆశలు నెలకొన్నాయి.
బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి మార్పులు ఉంటాయని ట్యాక్స్ పేయర్లు, మధ్య తరగతి ప్రజలు నమ్మకంతో ఉన్నారు.
బడ్జెట్లో ఆదాయపు పన్నులో మూడు కీలక మార్పులు తీసుకురావచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 87A కింద ప్రస్తుతం రూ.7 లక్షల వరకు లిమిట్ ఉంది. ప్రస్తుతం ఉన్న పన్ను రహిత ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచవచ్చని చెబుతున్నారు.
రూ.4 లక్షల వరకు ఆదాయం ఉంటే.. జీరో ట్యాక్స్, రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు 5 శాతం ట్యాక్స్, రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఉంటే 30 శాతం ట్యాక్స్ విధించేలా మార్పులు చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పన్ను