Union Budget 2025 Gold Update: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, బంగారం కొనే ఆలోచన ఉంటే ఏప్రిల్ వరకూ ఆగండి

Union Budget 2025 Gold Update: కేంద్ర బడ్జెట్ 2025 వచ్చేసింది. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదే సమయంలో పసిడి ప్రియులకు సైతం గుడ్‌న్యూస్ ఇస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 1, 2025, 05:35 PM IST
Union Budget 2025 Gold Update: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, బంగారం కొనే ఆలోచన ఉంటే ఏప్రిల్ వరకూ ఆగండి

Union Budget 2025 Gold Update: పసిడి ప్రియులకు అలర్ట్‌తో పాటు గుడ్‌న్యూస్. బంగారం కొనే ఆలోచన ఉంటే కాస్త ఆగడం మంచిది. ఎందుకంటే్ పసిడి ధర భారీగా తగ్గనుంది. బడ్జెట్‌‌ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్ నుంచి బంగారం ధరలు తగ్గనున్నాయి. 

ఇటీవలి కాలంలో పసిడి ధర ఆకాశాన్నంటుతోంది. రోజురోజుకూ పసిడి ధరలు పెరుగుతూ ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77 వేలు దాటి ఉంది. చాలామంది తమ ఇన్వెస్ట్‌మెంట్‌ను బంగారంపై పెడుతుంటారు. అలా బంగారం కొనుగోలుకు ప్లాన్ చేసేవాళ్లకు ముఖ్యమైన అప్‌డేట్ ఇది. బంగారం కొనే ఆలోచన ఉంటే ఓ మూడు నెలలు వాయిదా వేసుకుంటే మంచిది. ఏప్రిల్ నెల వరకూ నిరీక్షిస్తే ఆ తరువాత బంగారం ధరలు తగ్గనున్నాయి. ఎందుకంటే కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని భారీగా తగ్గించారు. 15 శాతాన్ని ఏకంగా 6 శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దాంతో ఏప్రిల్ తరువాత బంగారం, వెండి ధరలు భారీగా తగ్గనున్నాయి. 

దేశంలో బంగారం, వెండి లిక్విడిటీ పెంచడం ద్వారా డిమాండ్ పెంచేందుకు ఈ రెండింటిపై కస్టమ్ డ్యూటీ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే కస్టమ్ డ్యూటీ తగ్గించడంతో వ్యాపారులు భారీగా పసిడి దిగుమతి చేసుకుంటారు. అక్రమ బంగారం  దిగుమతి కూడా తగ్గుతుంది. బంగారానికి డిమాండ్ పెరిగి తయారీ రంగం పుంజుకుంటుంది. అదే విధంగా ఎగుమతులు కూడా పెరగడంతో దేశానికి ట్యాక్స్ రూపంలో ఆదాయం సమకూరుతుంది. పెద్ద పెద్ద పసిడి కంపెనీలకు ఇది ఊరటనిచ్చే వార్త. స్టాక్ మార్కెట్‌లో షేర్లు కూడా పెరగనున్నాయి. 

కొత్త బడ్జెట్ నిర్ణయాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అందుకే బంగారం కొనే ఆలోచన ఉంటే ఏప్రిల్ తరువాత పసిడి ధరలు తగ్గుతాయి. అందుకే అప్పటి వరకూ వాయిదా వేసుకుంటే లబ్ది పొందుతారు. 

Also read: Union Budget 2025 Tax Slabs: ఆదాయం 12 లక్షలు దాటినా లాభమే, ఎవరికకెంత ఆదా అవుతుందో చూద్దామా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News