Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త బడ్జెట్ ను ఆవిష్కరిస్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పటికే రైతులకు, మహిళలకు చాలా మందికి వరాల జల్లులు కురిపించారు. మధ్య తరగతి ప్రజల కోసం పన్ను చెల్లింపులపై కీలక ప్రకటన చేశారు. కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ బిల్లును తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఇది చాలా సులుభంగా ఉంటుందని తెలిపారు. టీసీఎస్, టీడీళఎస్ వంటి వాటిని హేతుబద్దీకరిస్తామని తెలిపారు. పీటీఐ సంస్కరణలు ఉంటాయని చెప్పారు. సీనియర్ సిటిజన్లకు సంబంధించిన టీడీఎస్, టీసీఎస్ పరిమితిని రూ. 50వేల నుంచి లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఎల్ఆర్ఎస్, రెమిటెన్స్ వంటి వాటిపై టీసీఎస్ ను రూ. 7లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచారు. విద్యారంగానికి సంబంధించి రెమిటెన్స్ పై టీసీఎస్ ఎత్తి వేయనున్నట్లు తెలిపారు. రూ. 12లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
Also Read: Budget 2025: రైతులకు కేంద్రం శుభవార్త.. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపు
ఆదాయపు పన్ను పరిమితిని ఈ విధంగా పెంచారు
2005: ₹1 లక్ష
2012: ₹2 లక్షలు
2014: ₹2.5 లక్షలు
2019: ₹5 లక్షలు
2023: ₹7 లక్షలు
2025: ₹12 లక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook